PRABHU NEE CHIRUNAMA EMI -SRI GHANTASALA- ప్రభూ ! నీ చిరునామా ఏమి- శ్రీ ఘంటసాల -శ్రీ ఆరుద్ర-ARUDRA
Автор: Charepalli RK Music Channel
Загружено: 2025-02-12
Просмотров: 1551
SINGER & MUSIC DIRECTION : SRI GHANTASLA
LYRICS : SRI ARUDRA
శ్రీ ఆరుద్ర గారి అద్భుతమైన రచనకు,శ్రీ ఘంటసాల వారి గాత్రం సొబగులు దిద్దినది.ఈ రచనలో దేవునికి వేసిన చమత్కార ప్రశ్నలు ఘంటసాల మాస్టారు గళంలో చమక్కుమన్నాయి.చక్కని సంగీతంతో పాట ఆద్యంతం ఓ సెలయేటి పరుగులాగా పరవళ్లు తొక్కుతుంది.ఇది తెలుగువారి అదృష్టం.తెలుగుపాట వినే వారి అందరి అదృష్టం.ఈ లలితగీతానికి భావవ్యక్తీకరణకు చేసిన వీడియో ప్రయత్నం శ్రీ ఘంటసాల వారు ఉన్నవే అయితే సరయిన న్యాయం చేయగలవని ప్రగాఢంగా నమ్మి నేను చేసిన ఈ ప్రయత్నం ఫలించింది అని నా భావన.రసజ్ఞులు అయన మీరు మీ అభిప్రాయాలను తెలిపితే సంతోషం
పాటను కొనసాగిస్తు పల్లవిని పునరావృతం చేయడంలో ఉద్దేశ్యం దేవుని చిరునామా కోసం కాశీ నుండి కన్యాకుమారి వరకూ వెదకినా ,ఆకాశ మార్గాన పయనించి భువిని గంగా ప్రవాహము పరవళ్లను పరికించినా ఆ దేవుని చిరునామా దొరకలేదని తెలిపే ఓ ప్రయత్నం అది. ఇక శ్రీ ఘంటసాల వారి పేరిట తపాలాబిళ్ళ విడుదల కార్యక్రమంలో వారితో పాడిన అనేక గాయని గాయక శ్రేష్ఠులు ఉండడంతోను, సందర్భం పోస్టల్ అడ్రస్ కోసం తపించే భావనలు ఉన్న పాట కారణంగా బాగా నప్పింది అని చేర్చాను.
చివరలో చూపిన ఫోటో ఈ పాటను ఓ పదేళ్ల క్రితం నాకు వినిపించిన నా శ్రీమతి అన్నగారు కీ.శే శ్రీ బెళ్ళావి మారేపల్లి వేంకటనారాయణ శర్మగారు.వారు ఘంటసాలగారి మిక్కిలి అభిమాని.వారికి ఈ వీడియో అంకితం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: