ఆ భూములకు మ్యుటేషన్లు నిలిపివేత..|| Sagevideos || Sage media
Автор: Sage Media
Загружено: 2025-10-30
Просмотров: 2195
#landrestoration #agricultureland #assignmentland #telugu
ఆ భూములకు మ్యుటేషన్లు నిలిపివేత..
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ వ్యవస్థ ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఒక్కో గ్రామంలో వందల ఎకరాలు ‘ఇతరులు’ (Others) అనే పేరుతో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విభాగంలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు సర్వే నంబర్లు, వారసత్వ ఆస్తులు, భాగపంపిణీ కాని స్థలాలు అన్నీ కలిసిపోయి గజిబిజిగా మారిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం, రైతుల అవగాహన లోపం కలిసి ఈ సమస్యను మరింత తీవ్రం చేశాయి.
‘ఇతరులు’ అంటే ఎవరు?: రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు లేనప్పుడు లేదా రైతు పాస్‌పుస్తకం తీసుకోకపోతే ఆ భూమి ‘ఇతరులు’ విభాగంలోకి వెళ్లిపోతుంది. వెబ్‌ల్యాండ్‌లో “పట్టాదారు పేరు” కాలమ్ కింద ‘ఇతరులు’, ‘అన్‌క్లెయిమ్డ్’, లేదా 9999, 9998, 4000 వంటి ఖాతా నంబర్లతో నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల ‘అ’ అనే అక్షరం పెట్టి వదిలేస్తున్నారు. ఈ విధానం రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, నిర్వాకానికి ప్రతిబింబం. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం, అమ్మానిగుడిపాడు, బోయలపల్లి, ఉయ్యాలవాడ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రికార్డులు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
రైతుల భూములు కూడా ‘ఇతరులు’ పేరులోనే:భూమి పత్రాలు ఉన్నా, రైతు భాగపంపిణీ చేయించుకోకపోయినా లేదా ఆన్లైన్‌లో అప్డేట్ చేయించుకోకపోయినా ఆ భూములు కూడా ఈ విభాగంలోకి వెళ్తున్నాయి. ఇది వాస్తవ హక్కుదారులకే ఇబ్బంది కలిగిస్తోంది. కొన్నిసార్లు సర్కార్ భూములు, అసైన్ ల్యాండ్లు, సాదా క్రమం భూములు, సీలింగ్ పట్టాలు, డి.పట్టాలు అన్నీ ఒకే విభాగంలో పడుతున్నాయి. ఇందువల్ల భూ రికార్డులు గజిబిజిగా మారి, పట్టాదారు ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో:ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోనే 7 వేల ఎకరాలకుపైగా భూములు ‘ఇతరులు’ పేరుతో నమోదు అయ్యాయి. అందులో అమ్మానిగుడిపాడులో 1,273 ఎకరాలు, యర్రగొండపాలెంలో 526 ఎకరాలు, బోయలపల్లిలో 213 ఎకరాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని గ్రామాల్లో సుమారు 200 ఎకరాల భూములు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఈ గణాంకాలు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం.
మ్యుటేషన్లకు బ్రేక్ - అవకతవకలపై దృష్టి:ఇటీవల ‘ఇతరులు’ పేరుతో ఉన్న భూములపై మ్యుటేషన్లను అధికారులు నిలిపివేశారు. కారణం క్షేత్రస్థాయిలో అవకతవకలు, ఫిర్యాదుల వెల్లువ. కొన్ని చోట్ల వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తమ ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను రికార్డుల్లో నమోదు చేసి, మ్యుటేషన్ అయిన తర్వాత కూడా మెసేజ్‌లు తమకే రావడం వంటి దుర్వినియోగాలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిషేధిత భూములు కూడా ‘ఇతరులు’ పేరుతో మార్చడం, అధికారుల దృష్టికి రావడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించేందుకు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
రీసర్వే ఉన్నా సమస్య తీరలేదు:రీసర్వే జరిగినా భూముల గజిబిజి ఇంకా అలాగే ఉందని రైతులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో రీసర్వే కేవలం మొక్కుబడిగా జరిగి, పాత తప్పులే కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ల వారీగా యజమానుల వివరాలు స్పష్టంగా ఉండాల్సిన చోట, ‘ఇతరులు’ అనే పేరుతో లెక్కలు వేసి వదిలేస్తున్నారు. “ఇతరులు” పేరుతో ఉన్న భూముల గజిబిజి రెవెన్యూ శాఖలోని రికార్డు వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది.
#andhrapradesh #letestnews #landmutton #apgovernment #revenuerecord #youtubevideos #youtubutelugu #assignment #apnews #letestnews #telugu
https://www.instagram.com/sage31jly?i...
https://www.facebook.com/share/fUzSs2...
https://x.com/ThullimelliK?t=MLgRjPfD...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: