🔴LIVE అమావాస్య ఆదివారం మొదటి రోజు కూడా వెళ్లి మాఘమాస జాతర కు లక్షలాది మందిభక్తులు
Автор: TVY Telugu
Загружено: 2026-01-18
Просмотров: 167
#tvytelugu
#tvytelugunews
దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ రాజిరెడ్డి, ఈవో శ్రీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరం పల్లి గ్రామ శివారులో వాగు ఒడ్డున వెలసిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి మాఘమా అమావాస్య జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.మాగ అమావాస్య ఆదివారం కావడంతో వాగులో స్నానాలు చేయడానికి భక్తులు దేవాలయానికి పోటెత్తారు. పుణ్యస్నానాలు చేసి దేవుని దర్శించుకునే భక్తులు దేవాలయంలో పోటీస్తారు. ఉదయం నుండి క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ మాఘమా అమావాస్య సందర్భంగా ప్రారంభమయ్యే కూడవెల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం నుండే లక్షల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించినట్లు మాఘమా అమావాస్య ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఐదు రోజులపాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. స్నాన ఘట్టాల వద్ద భక్తుల కోసం నీళ్లలో నెట్లను ఏర్పాటు చేసి 16 మంది గజా ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ జాతర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జాతరను దిగ్విజయం చేయాలని కోరారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జాతరకు భక్తులు పోటెత్తడం జరిగిందన్నారు. ఆలయం తరపున భారీ గేట్లు ఏర్పాటు చేశారని కానీ భక్తులకు చాలావరకు అసౌకర్యాలు ఏర్పడ్డాయి అన్నారు. ఐదు రోజులు జరిగే జాతరలో భక్తుల కోసం కూడా అధికారులు ఏర్పాటు చేసి అసౌకర్యాలు కరగకుండా చూసుకోవాలని కోరారు. పోలీసు అధికారులు కూడా భక్తుల పట్ల సమన్వయం పాటించి దర్శనాలు మంచిగా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ డైరెక్టర్లు అర్చకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: