మందులు వాడకుండా డైట్ తో డయాబెటిస్ ని నియంత్రించవచ్చా? | Diabetic Diet | Medicover Hospitals
Автор: Medicover Hospitals
Загружено: 2021-04-15
Просмотров: 393344
మందులు వాడకుండా డైట్ తో డయాబెటిస్ ని నియంత్రించవచ్చా? | Diabetic Diet | Medicover Hospitals
డా. ఏ. ఆర్. కృష్ణ ప్రసాద్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో డైట్ తో డయాబెటిస్ ని ఎలా నియంత్రించవచ్చు అనే అంశాల పై పూర్తిగా వివరించారు.
0:00 - మందులు వాడకుండా డైట్ తో డయాబెటిస్ ని నియంత్రించుకోవచ్చా?
మందులు వాడకుండా డైట్ తో డయాబెటిస్ ని నియంత్రించడం అందరికి సాధ్యం కాదు, ఎందుకు అంటే అందరికి డైట్ పాటించే అవకాశం లేకపోవచ్చు, అందరి శరీరాలు డైట్ కి సహకరించకపోవచ్చు, అరవై సంవత్సరాలు దాటినా వారు బలహీనంగా ఉంటారు కాబట్టి అలంటి వారికి డైట్ పాటించడం కష్టం అవుతుంది. కానీ అవగాహన పెంచుకొని ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిది అని తెలుసుకుంటే, షుగర్ నియంత్రణ అనేది మన చేతుల్లో ఉంటుంది.
2:34 - డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది:
గ్లైసెమిక్ సూచిక తక్కువ ఉన్న పదార్ధాలు తీసుకోవాలి.
కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్న పదార్ధాలు తీసుకోకూడదు.
షుగర్ తో చేసిన పదార్ధాలు తీసుకోకూడదు.
సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి
నేల మీద పండే ఆహారాలు, ఆకు పచ్చ రంగులో ఉండే పదార్ధాలు తీసుకోవాలి.
నేల కింద పండే ఆహార పదార్ధాలని తీసుకోకూడదు.
7:33 - డయాబెటిస్ ఉన్న వాళ్ళు మాంసాహారం తినవచ్చా:
అధ్యయనాల ప్రకారం, శాఖాహారం డైట్ అనేది మాంసాహారం కంటే కూడా మంచిది.
శాఖాహారం లో కూడా పూర్తిగా కొవ్వు, ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
శాఖాహారం డైట్ లో కూడా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవాలి, పాల ఆధారిత ఉత్పత్తులను తినకూడదు.
మాంసాహారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
11:00 - ప్రధాన శస్త్రచికిత్సలు అయిన వారు కూడా ఇలాంటి డైట్ ఏ పాటించవచ్చా:
ఆపరేషన్ ఐన వెంటనే డైట్ పాటించడం అలా కాకుండా, పూర్తిగా కోలుకున్న తరువాత వైదుడిని సంప్రదించి, ఆరోగ్యం సరిగ్గా ఉంది అంటే డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వ్యాయామం ఈ మూడు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వయసు ఎక్కువగా ఉండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ తక్కువ ఉండి, ఎక్కువ లావు లేని వారు వైద్యులని సంప్రదించి, సరైన పరీక్షలు చేయించుకొని, అప్పుడు ఇలాంటి డైట్ పాటించవచ్చు.
13:48 - డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వ్యాయామం ఇవన్నీ పట్టిస్తూ, డయాబెటిస్ కి మందులు వాడాల్సిన అవసరం లేదా:
డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వ్యాయామం ఇవన్నీ చికిత్స లో భాగం మాత్రమే. మందులు, ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు, మెల్లిగా డైట్ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి, అప్పుడు మందులు తగ్గిస్తూ రావచ్చు.
డైట్ పాటిస్తున్నాం అని మందులు మానేయడం వంటివి చేయకూడదు.
మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి.
#HowtoControlDiabetes #DiabetesDietTelugu #MedicoverHospitals
For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/
►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.
Follow us on Other Platforms:
Facebook: / medicoverhospitals
Instagram: / medicoverhospitals
Twitter: / medicoverin
LinkedIn: / medicoverhospitals
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: