సింహాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు – భక్తిశ్రద్ధలతో ఆరవ పాశుర పారాయణం
Автор: AksharaVision News
Загружено: 2025-12-20
Просмотров: 28
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలం
సింహాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు – భక్తిశ్రద్ధలతో ఆరవ పాశుర పారాయణం
సింహాచలం, డిసెంబర్ 21:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఆదివారం వేకువజామున జరిగిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా గోదాదేవి రచించిన తిరుప్పావైలోని ఆరవ పాశుర పారాయణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ వేడుకలు ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ గారి పర్యవేక్షణలో అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు.
ఆరవ పాశురమైన "పుళ్ళమ్ శిలంబినకాణ్" విశిష్టతను, అందులోని అంతరార్థాన్ని ఆయన భక్తులకు వివరించారు.
పరమాత్మను మేల్కొలిపే క్రమంలో పక్షుల కిలకిలారావాలు, ముని గణాలు చేసే హరినామ స్మరణ ఏ విధంగా భక్తుడిని ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తాయో రాజగోపాల్ గారు వివరించారు.
స్వామివారికి ధనుర్మాస ప్రత్యేక ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించారు. భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని గోదా-రంగనాథుల అనుగ్రహం కోసం జరిగిన ఈ పారాయణంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ధనుర్మాసం ముగిసే వరకు ప్రతిరోజూ వేకువజామున ఈ పాశుర పారాయణం కొనసాగుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: