గొర్రెలు ఎలా మరణించాయి ? అసలు ఏం జరిగింది ?
Автор: TV6 24 /7 NEWS
Загружено: 2024-07-31
Просмотров: 23265
మన టీవీ సిక్స్ న్యూస్ పెనుబల్లి మండలం రామచందర్రావు బంజర గ్రామానికి చెందినటువంటి బోలె రాంబాబుకు
చెందిన గొర్రెలు లంక సాగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి దాబా హోటల్ వెనుక భాగంలో రసాయనాలు కలిసిన నీటిని తాగడంతో సుమారు 20 గొర్రెలు మరణించాయి. రసాయనాలు సప్లై చేస్తున్న ట్యాంకర్లు వాటిలో మిగిలిపోయిన రసాయనాలను ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పారబోస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు అక్కడ చేరింది. ఎప్పటిలాగానే ఈ రసాయనాలు అక్కడే పారబోశారు. పారబోసిన రసాయనాలు ఆనీటిలో కలిశాయి. ఆ నీటిని తాగిన గొర్రెలు మరణించాయి. ఇవే కాకుండా గత నాలుగు రోజుల క్రితం కూడా గుంజ సత్యావతి కి చెందిన నాలుగు గొర్రెలు చనిపోగా అవి అస్వస్థకు గురై చనిపోయాయని అనుకున్నారు. కానీ బుధవారం గొర్రెలు మరలా చనిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: