శ్రీవారిని దర్శించుకున్న న్యాచురల్ స్టార్ నాని..
Автор: STUDIO N9 NEWS
Загружено: 2025-04-26
Просмотров: 43
తిరుమల
@STUDIO N9 NEWS@
@ Natural Star Nani @
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని న్యాచురల్ స్టార్ నాని దర్శించుకున్నారు. హిట్ 3 చిత్ర కథానాయకి శ్రీనిధి శెట్టి తో కలసి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నానికి వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వచ్చిన నానిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. నానితో సెల్ఫీలు దిగి ఖుషీ అయ్యారు. కొందరు భక్తులతో నాని స్వయంగా సెల్ఫీలు తీశారు. దర్శన అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ…. ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఓ ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సినిమా విడుదల ముందు శ్రీవారికి మొక్కులు చెల్లించకుంటే ఓ వెలితి అలానే ఉండిపోతుందని చెప్పారు. చాలా చక్కటి దర్శించడం దర్శనం జరిగిందని…. చాలా ఆనందంగా ఉందని అన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: