గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనానికి సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Автор: Viiddura Media
Загружено: 2025-12-05
Просмотров: 114
దెందులూరు 05.12.2025
"అక్రమార్కుల అండ చూసుకుని ప్రభుత్వ, ప్రజల భూములు ఎవరైనా ఆక్రమణలు చేస్తామంటే చూస్తూ ఉపేక్షించం": దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ హెచ్చరిక
"గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనానికి సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా నిర్వహిస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..
పెదవేగి మండలం పెదవేగి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక కూటమి నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేస్తూ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు అనే అంశాన్ని స్థానికులు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి దృష్టికి తీసుకువచ్చారు..
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ పెదవేగి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క భూమిని అన్యాక్రాంతం చేసి ఆక్రమించాలనే దురుద్దేశంతో ఎవరు ప్రయత్నించినా వాటిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని , దాతలు ఎంతో గొప్ప మనసుతో ప్రజలకు మేలు చేయాలని ఇచ్చి ఉన్నటువంటి స్థలాలను ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని, అదే విధంగా దాతల కుటుంబ సభ్యులు ఎవరైనా తమ దాతల విగ్రహాల ఏర్పాటు శిలాఫలకాల ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి మంజూరు చేయిస్తామని, ప్రతి ఏటా వారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేలా కూడా చర్యలు చేపడతామని , అంతేతప్ప దాతలు ఎంతో గొప్ప మనసుతో ప్రజల కోసం ఇచ్చినటువంటి భూములను అక్రమార్కుల అండ చూసుకుని ఆక్రమణలకు పాల్పడతామంటే మాత్రం వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు... అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి భూముల సమస్యల పరిష్కారానికి 22a సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
-----
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: