100 ఏళ్ల భవనం.. సరికొత్తగా తీర్చిదిద్దిన నటుడు మురళీమోహన్
Автор: Eenadu
Загружено: 2025-03-11
Просмотров: 87435
100 ఏళ్ల క్రితం తన తాతగారు నిర్మించిన భవనాన్ని ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ మరమ్మతులు చేయించి సరికొత్తగా తీర్చిదిద్దారు. వారసత్వంగా వస్తున్న ఇంటిని కాపాడుకోవడమే కాకుండా.. మరో 50 నుంచి 60 ఏళ్ల వరకూ చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా చాటపర్రులోని ఈ భవంతిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన గృహప్రవేశ వేడుకకు విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని తన స్నేహితులు, బంధువులతో మురళీ మోహన్ సంతోషంగా గడిపారు. సకల వసతులతో తీర్చిదిద్దిన ఈ ఇంటిని.. మురళీ మోహన్ ఛారిటబుల్ ట్రస్టు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. #eenadunews #eenadu #cinemanews #muralimohan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: