శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా కార్తీకమాసం సాంగ్ 2025
Автор: bugga rameshwara entertainment pothugallu
Загружено: 2025-10-27
Просмотров: 3726
శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా
కార్తీకమాసం సాంగ్ 2025
రచన:- బి.రాజశేఖర్ పోతుగల్లు
లిరిక్స్: -
పల్లవి:-
శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా
స్వామీ మము కరుణించ రావయ్యా
దేవా మము దీవించ రావయ్యా
చరణం 1:-
నీ సన్నిధి చేరినమూ నీ దర్శనమీవ్వయ్యా
శ్రీబుగ్గరామేశ్వరా
నాగభూషణ నటరాజా దయతో మమ్ము బ్రోవుమయా పోతుగల్లు పరమేశ్వరా
నిను నిత్యమూ మేము కొలిచేమూ నీ నామమునే
మేము పలికేమూ
విశ్వేశ్వరాయ భువనేశ్వరాయ దేవా
శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా
స్వామీ మము కరుణించ రావయ్యా
దేవా మము దీవించ రావయ్యా
చరణం 2:-
చుక్కపొద్దుట లేచేమూ శుద్ధిగ స్నానము
చేసేదమూ శ్రీబుగ్గరామేశ్వరా
పొద్దుమాపు ఘనాముగా నీకుపూజలు చేసేదమూ
పోతుగల్లు పరమేశ్వరా
మేము మనసారా నిను మొక్కినమూ
ఓ మహదేవా మా పరమేశా
గంగాధరాయ గౌరీశ్వరాయ దేవా
శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా
స్వామీ మము కరుణించ రావయ్యా
దేవా మము దీవించ రావయ్యా
చరణం 3:-
భక్తుల మొరను వినవయ్యా భ్రమరాంబలోల భగవంతా శ్రీబుగ్గరామేశ్వరా
కోరిన కోర్కెలు నెరవేర్చి సల్లగ మమ్ము దీవించూ
పోతుగల్లు పరమేశ్వరా
నిను మరువమయా శివశంకరుడా నీ మహిమలనే
మకు చూపుమయా
అఖిలేశ్వరాయ ఓంకారరూప దేవా
శివశంకరుడ పరమేశ్వరుడ పోతుగల్లు మహదేవా
స్వామీ మము కరుణించ రావయ్యా
దేవా మము దీవించ రావయ్యా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: