//ఊరిలో నున్నాడు వరసిద్ది గణపతి//vinayaka song//Jyothi kishor
Автор: ఆచార్య కటాక్షం
Загружено: 2025-09-03
Просмотров: 194
#acharyakataksham
#vinayakachavithi
#ganeshutsav
#vinayakasongs
share like comment and subscribe
singer:sri Jyothi kishor
ఊరిలోనున్నాడు వరసిద్ది గణపతి
చూసి తరిద్దాం చారిత్రక గణపతి
//ఊరిలోనున్నాడు//
ధీర శివాజీ ఆరంభించగా
లోకమాన్యుడు విస్తృత పరిచేను
మహోన్నతము ఈసందేశము
గణపతి పూజల ఘన వైభవము
//ఊరిలో నున్నాడు//
రారాజుల కాలములోన
చాతుర్యపు శిల్పులు చెక్కిన
భక్తాదులు ఆరాధించిన
ఘన వైభవపు గణేష మూర్తులు
//ఊరిలోనున్నాడు//
విద్వంసపు చరిత చూపుతూ
తరిగిపోని కళానిధులతో
వీనుల విందుగా దర్శనమిచ్చే
లంభోదరుని సుందర మూర్తులు
//ఊరిలో నున్నాడు//
ప్రకృతి ఒడిలో మట్టి గణపతిగా
పూజలందుకోను మహా గణపతి
పూజలు లేని శిలా మూర్తులు
ఊరి ఊరిన కానవచ్చును
//ఊరిలో నున్నాడు//
భక్తి ముసుగున వికృత చేష్టలు
వింత పోకడల మానుకోనగా
ఆదర్శంగా అడుగువేయగా
కదులుదాము మనమందరం
//ఊరిలో నున్నాడు//
పర్యావరణ హితముగా కదిలి
జానపదాల కాంతులు చూపి
నవరాత్రుల సందేశముతో
నడవగా మనము ధర్మ దీప్తితో
//ఊరిలోనున్నాడు//
భారతీయతను భువిలో నిలపగా
భరతమాత ముద్దుబిడ్డలుగా
భావితరాలకు బంగారు బాటగా
జరుపుదాము ఉత్సాహంగా
//ఊరిలోనున్నాడు//
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: