తుమ్మలపెంటలో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు|KAVALI|AP10 NEWS|
Автор: AP10 NEWS INDIA
Загружено: 2026-01-18
Просмотров: 40
ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
యాంకర్ వాయిస్
స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు.కావలి రూరల్ మండలం తుమ్మల పెంట గ్రామంలో రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ,తెలుగు జాతి గర్వించదగిన మహా నాయకుడు ఎన్‌టీఆర్ అని, సినిమా రంగంలో నటసార్వభౌముడిగా, రాజకీయాల్లో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరచిపోలేనివని అన్నారు. సామాన్యుల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడిగా ఎన్‌టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి, రక్తదానం చేసిన యువకులను అభినందిస్తూ వారి సేవాభావాన్ని ప్రశంసించారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో యువత ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తదుపరి భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: