Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

పూర్ణాలు & మినప గారెలు | Vinayaka Chavithi: MUST-TRY Naivedyam Recipes

Автор: HomeCookingTelugu

Загружено: 2025-08-26

Просмотров: 2962

Описание:

పూర్ణాలు & మినప గారెలు | Vinayaka Chavithi: MUST-TRY Naivedyam Recipes ‪@HomeCookingTelugu‬

#poornalu #teluguvantalu #sweetsrecipes #hemasubramanian #poornamboorelu #minapagarelu #teluguvantalu #meduvadarecipe #meduvadaintelugu #garelurecipe #breakfastrecipes #vantaluintelugu #tastyvantalu

Chapters :
Promo : 00:00
Poornam Boorelu : 00:17
Minapa Garelu : 05:17

తయారుచేయడానికి: 8 గంటలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5

కావలసిన పదార్థాలు

ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు
సెనగ పప్పు - 1 కప్పు
నీళ్లు - 1 1 / 2 కప్పులు
బెల్లం - 1 కప్పు
తురిమిన కొబ్బరి - 1 / 2 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
నెయ్యి

పిండి చేయడానికి కావలసిన పదార్థాలు
ఉప్పుడు బియ్యం - 1 / 2 కప్పు
పచ్చి బియ్యం - 1 / 2 కప్పు
మినపప్పు - 1 / 4 కప్పు
ఉప్పు
వేయించడానికి సరిపడా నూనె

తయారుచేసే విధానం
పిండి తయారుచేసే విధానం
ఉప్పుడు బియ్యాన్ని, పచ్చి బియ్యాన్ని, మినపప్పుని వేరువేరుగా నీళ్ళల్లో ఐదు గంటలపాటు నానపెట్టాలి
ఇప్పుడు మినపప్పుని మిక్సీలో వేసి మెత్తటి పిండిలాగా తయారుచేసుకోవాలి
అలాగే, ఉప్పుడు బియ్యాన్ని, పచ్చి బియ్యాన్ని కూడా వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి
ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒక బౌల్లోకి వేసి, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
ఈ పిండి ఇడ్లీ పిండిలాగా పలచగా కాకుండా గట్టిగా, ఉండాలి
ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా, అంటే సుమారుగా 8 గంటల పాటు పక్కన పెట్టి పులియపెట్టాలి
ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు
సెనగపప్పుని 2 గంటలపాటు నీళ్ళల్లో నానపెట్టాలి
నానపెట్టిన సెనగపప్పుని కుక్కర్లో వేసి, సరిపడా నీళ్లు పోసి, 3 విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించాలి
ఇప్పుడొక గిన్నెలో బెల్లం వేసి, అందులో నీళ్లు పోసి, ఒక ఉడుకు రానిచ్చిన తరువాత పక్కన పెట్టుకోవాలి
ఒక పాన్లో రుబ్బి పెట్టుకున్న సెనగపప్పుని వేసి, కాచి వడకట్టుకున్నబెల్లం పాకాన్ని అందులో వేసి ఒక ఉడుకు రానివ్వాలి
ఇందులో తురిమిన కొబ్బరి, యాలక్కాయాల పొడి వేసి, పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి 2 నిమిషాలపాటు పప్పు మిశ్రమం దగ్గరపడే వరకూ కలుపుతూ ఉండాలి
ఇప్పుడు ఈ పప్పు బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలాగా చుట్టుకుని, పక్కన పెట్టుకోవాలి
అన్ని ఉండల్ని ఒకే పరిమాణంలో ఉండేట్టు తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి
పూర్ణాలు తయారుచేసే విధానం
పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, నూనెను మరిగించిన తరువాత, పప్పు ఉండల్ని పులియపెట్టిన పిండిలో ముంచి వాటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసి వేయించుకోవాలి
ఈ పూర్ణాలని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రూమ్ టెంపరేచర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు

తయారుచేయడానికి: 6 గంటలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 6 - 7

కావాల్సిన పదార్థాలు

మినపప్పు - 1 కప్పు (Buy: https://amzn.to/2Ul3EZi)
కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి
ఉప్పు - 1/2 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు
వేయించడానికి సరిపడా నూనె (Buy: https://amzn.to/2RGYvrw)

తయారుచేసే విధానం

మినపప్పుని నాలుగు గంటల పాటు నీళ్ళల్లో నానపెట్టాలి

ఇప్పుడు పప్పుని వడకట్టి, ఒక మిక్సీ జారులో వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ జారుగా కాకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి

ఇప్పుడు ఈ పిండిని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి

రెండు గంటల తరువాత ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసి బాగా కలపాలి

ఇప్పుడొక అరిటాకు తీసుకుని, కొద్దిగా నీళ్లతో కడగాలి

రుబ్బుకున్న పిండిని కొద్దిగా తీసుకుని, అరిటాకులో పెట్టి, మధ్యలో కన్నం పెట్టి గారెలలాగా ఒత్తుకోవాలి

ఇప్పుడొక బాండీలో నూనె వేసి వేడి చేసి, నెమ్మదిగా గారెలని వేసుకుని, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి

వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది



Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book at https://shop.homecookingshow.in/

Follow us :
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  

A Ventuno Production : http://www.ventunotech.com

పూర్ణాలు & మినప గారెలు | Vinayaka Chavithi: MUST-TRY Naivedyam Recipes

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]