మరియతల్లి
Автор: SMJ CREATIONS
Загружено: 2025-12-09
Просмотров: 563
CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church, the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching the first time or not yet subscribed,
please do subscribe to SMJ CREATIONS to receive the latest videos which would help you grow in Faith
Lyrics : Fr Yohanu Katru
Song 6
అమ్మా నీ ప్రేమను మరువగలనా
అమ్మా నీ మాతృకను వెంబడించగలనా
అమ్మా అమలోద్భవిమాత వందనం
అమ్మా నిష్కళంక మాత వందనం/2
నీ చల్లని చూపులే నా ఆధారం
నీ నిత్య ప్రార్ధనలే నా ధైర్యం/2
నీ చెంతన నేర్చుకొందును
క్రీస్తును ..హృదిలో స్వీకరింతును
అమ్మా అమలోద్భవిమాత వందనం
అమ్మా నిష్కళంక మాత వందనం/2
పరమదేవుని మెప్పించితివి
స్త్రీలందరిలో కీర్తించబడితివి/2
నీవే మాకు నిత్యము అభయం
నీ పవిత్రతలో నడిపించుము
అమ్మా అమలోద్భవిమాత వందనం
అమ్మా నిష్కళంక మాత వందనం/2
Song 7
నిష్కళంక మాతకు జేజేలు
పరిశుద్ధ మాతకు జేజేలు
కృపగలమాతకు జేజేలు
అనురాగవల్లికి జేజేలు
కోరస్
అమ్మా నిష్కళంకమాత ప్రార్ధించుమా
నీ హృదిని పోలి జీవించ నేర్పించుమా
చరణం 1
నా చూపులే కళంకమైనవి
తలంపులే మలినమైనవి.
పాదములు పాపదారులైనవి
నా కరములు కీడెంచినవి
హృదిలో క్రీస్తుని నిలుపుకొనగా
అకళంక మనసునొందగా
నిరతము ప్రార్థించుమా
కోరస్
అమ్మా నిష్కళంకమాత ప్రార్ధించుమా
నీ హృదిని పోలి జీవించ నేర్పించుమా
చరణం 2
నా మాటలే అపవిత్రమైనవి
వీనులే చెడును వినుచున్నవి
నా కార్యములు హేయమైనవి
బంధాలే సాతాను వశమైనవి
ఈ జీవితమును మార్చుకొనగా
జీవవాక్కును పాటించగా
నిత్యం ప్రేరేపించుమా
కోరస్
అమ్మా నిష్కళంకమాత ప్రార్ధించుమా
నీ హృదిని పోలి జీవించ నేర్పించుమా
Song8
పల్లవి
అమ్మా మరియ ఆదరించుమా
నీ మాతృకలో మము నడిపించుమా
నిన్ను చూసి నేర్చుకొందుము
మా హృదిలో దాచుకొందుము
చరణం1:
నీ శుభ వచనములు
ఎలీశ బెతమ్మ చెవిని శోకగనే
ఆమె గర్భము నందలి శిశువు
గంతులు వేసేను
ప్రభువు వాక్కులు నెరవేరునని
విశ్వసించిన ధన్యురాలవు
రక్షకుడైన దేవుని యందు
ఆనందించిన ధన్యాత్మురాలవు
అమ్మా మరియ ఆదరించుమా
నీ మాతృకలో మము నడిపించుమా
నిన్ను చూసి నేర్చుకొందుము
మా హృదిలో దాచుకొందుము
చరణం2:
కానాపల్లి వివాహంలో
ద్రాక్షరసము తక్కువ పడగానే
నీ తనయుని వేడి వారికి
సహాయం చేసితివి
నీ ప్రార్థనలతో అపోస్తులను
బలపరిచిన విశ్వాసిరాలవు
నీ ఉపకారసహాయంతో
ఆదరించే వినయత్మురాలవు
అమ్మా మరియ ఆదరించుమా
నీ మాతృకలో మము నడిపించుమా
నిన్ను చూసి నేర్చుకొందుము
మా హృదిలో దాచుకొందుము
Song 9
తొలగును నాకీడు తొలగును
జరుగును నాకు మేలు జరుగును/2
నీ ప్రార్థనే నా కవచము
నీ సన్నిధే నా సంరక్షణ/2
అమ్మా పరిశుద్ధమాత
అమ్మా జపమాలమాత/2
చరణం 1
నీ ప్రార్ధన ముందు చీకటి నిలుచునా
నీవున్న చోట సాతాను గెలుచునా/2
నీరూపు చుడగా ధైర్యం కలుగును
నీ స్వరం వినగా ఊరట పొందెదను/2
అమ్మా పరిశుద్ధమాత
అమ్మా జపమాలమాత/2
చరణం 2
నీ బిడ్డలా నీ చెంతకు వచ్చెదను
నీ మాతృకలో నేను నడిచెదను/
ఆత్మలో అనుదినము ఆనందింతును
జయమిచ్చు క్రీస్తులో నిలిచెదను/2
అమ్మా పరిశుద్ధమాత
అమ్మా జపమాలమాత/2
Somg 10
కార్మికులకు కర్షకులకు అండగా
నిరాశ్రయులకు శరణార్థులకు నీడగా/2
కష్టజీవులకు పెన్నిధివై
దయరసముగల తల్లిగా వెలుగొందుచున్న మరియతల్లి
వందనం ..
మీకే మా వందనం
కోరస్
అమ్మా ఆపదలో శరణమా
మాకై ప్రార్థించుమా/2
చరణం1:
దీనుల దీనావస్థలో తోడుగా
అక్కరలో ఉన్న వారికి అండగా
నిరుపేదల బ్రతుకులలో బాసటగా
పీడితుల పాలిట వెలుగువై
ఉండుమా
అనాధలకు ఆశాజ్యోతివై నిలువుమా
అమ్మా ఆపదలో శరణమా
మాకై ప్రార్థించుమా/2
చరణం2:
సంతానప్రాప్తికై ప్రార్థించుమా
పాడిపంటల వృద్ధికై వేడుమా
ఆహారముకై అలమటించు బిడ్డలను కాపాడుమా
నీ తనయుని నిత్యము
మాకై ప్రార్థించుమా
అమ్మా ఆపదలో శరణమా
మాకై ప్రార్థించుమా/2
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: