నెల్లూరు మూలపేట పోలీస్ క్వాటర్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది - బాబీ భగత్
Автор: Bobby Bhagat
Загружено: 2025-12-22
Просмотров: 44
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్.నెల్లూరు రూరల్ వైస్సార్సీపీ 36వ డివిజన్ ఇంచార్జ్ బాబీ భగత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.నెల్లూరు రూరల్ 36వ డివిజన్ పరిధిలో ఉండే ఫతేఖాన్‌పేటలో శిధిలా వ్యవస్థలో ఉన్న పోలీస్ క్వాటర్స్ లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది.సాయంత్రం 7 దాటితే పోలీసు క్వార్టర్స్ లో ఉన్నటువంటి బ్లాక్ లలో యువత మద్యం సేవిస్తూ మద్యం సేవించిన సీసాలను పగలకొడుతూ రచ్చ చేస్తున్నారు.మరి కొంత మంది జూదగాళ్లు గంజాయి కొడుతూ పేకాట అచ్చ బొమ్మ మొదలైనటువంటి జూదానికి సంబంధించిన ఆటలాడుతున్నారు.మరి కొంత మంది క్వార్టర్స్ లో పరుపులు దిండులు వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కంటి చూపు మేరలో డీఎస్పీ గారి కార్యాలయం, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ యువత ఎటువంటి భయం లేకుండా పోలీస్ క్వార్టర్సుల్లోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరం.పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఎక్స్పైర్ డేట్ అయినటువంటి మందులను మరియు సిరప్లను మొదలైనటువంటి మెడిసిన్ అన్నింటిని కూడా ఆ క్వాటర్స్ లో పడివేయడం బాధాకరం.విచ్చలవిడిగా పడేసినటువంటి ఎక్స్పైర్ డేట్ అయినటువంటి మందులు తెలిసో తెలియకో ఎవరో ఒకరు వాడిన లేదు అక్కడికి వచ్చేటటువంటి మద్యం సేవించిన వారు వాటిని తీసుకున్న వాటి వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.క్వాటర్స్ కి సంబంధించిన ఇనుప తలుపులు,కిటికీలు ద్వాంసం చేసి మరి దుండగులు తీసుకోని వెళ్ళుతున్నారు. కావున ఈ శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ లను డమాలిష్ చేసి ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది ఏదో ఒకటి నిర్మిస్తే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది లేదా ఇటువంటి కార్యకలాపాలకు జరగకుండా ప్రత్యామ్నాయ మార్గం చూసి చర్యలు తీసుకోవాలని జిల్లా SP గారికి గ్రీవెన్స్ ద్వారా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: