Alasipoku, అలసిపోకు
Автор: Sound of Soul - Amithprem
Загружено: 2025-08-28
Просмотров: 82
జీవితం నిన్ను నలిపేది నిటారుగా-
నువ్వు నిలబడడానికే
జీవితంలో అవమానింపబడేది -
నువ్వు అభివృద్ధి చెందడానికే
నీ రక్తసంబందులు నిన్ను
నిర్దాక్షిణ్యంగా అవమానించిన
అలసిపోకు
నీ స్నేహితులు నీకు చేసిన
మోసాలకు నీవు నలిగిపోయినా
చింత పడకు
అలసిపోకు ఆవేదన - ఉన్న చోట
నిలుపుకో నేను నీతో-
అన్నమాట
సమయమే నీకు తీర్పు ఓదార్పు
జీవితం నిన్ను నలిపేది నిటారుగా
నువ్వు నిలబడడానికే
జీవితంలో అవమానింపబడేది-
నువ్వు అభివృద్ధి చెందడానికే
నిన్ను ప్రేమించే వారు నిందించి
నీ మనసు పగలగొట్టిన
దిగులుపడకు
నీ వ్యతిరేకులు మెత్తని
నీ హృదయాన్ని విరగగొట్టిన నీవు -
భయపడకు
అలసిపోకు ఆవేదన- ఉన్నచోట
నిలుపుకో నేను నీతో- అన్నమాట
సమయమే నీకు తీర్పు నీకే నేర్పు
జీవితం నిన్ను నలిపేది- నిటారుగా
నువ్వు నిలబడటానికే
జీవితంలో అవమానింపబడేది -
నువ్వు అభివృద్ధి చెందడానికే
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: