Maha shivarathri Special Song 2022 | Swara Music
Автор: Swara Music USA
Загружено: 2022-02-25
Просмотров: 125
Swara Music & Swara Media presents Shivarathri Special Song.
పల్లవి:
శ్రీశైలంలో ఉన్న మల్లన్నా మల్లన్న
ఓంకార శంఖాన్ని పూరించేయ్ మాయన్న
నీ చేతిలో ఉన్న శూలం తిప్పేసై
మా కష్టాలన్నీ తరిమి కొట్టేసై
కైలాసంలో ఉన్న సాంబన్నా సాంబన్నా
అమ్మోరు సగమైనా నీదేహం నీదన్నా
నీ పక్కనే ఉన్నా డమరే మోగించేయ్
నీ తాండవ కేళి గజ్జే కట్టేసై
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సరా సరి మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సదాశివ మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
చరణం-1:
వేసవిలో మంచు కొండ
తలపైనా చల్లని గంగ
నీ సేద తీరుస్తాయంటా
చలికాలం నీ కనుమంట
కాలేటి మా చితిమంట
వెచ్చంగా నీ చెంతేనంటా
కాలాలనేలేటి ఓ శంభోలింగా
నీ కరుణే లోకంలో నదిలా పారంగా
మాలోన శివభక్తి కడలై పొంగంగా
లోలోని పాపాలే కరిగిపోవంగా
ఇలా మా నోరు నీ పేరునే పలుకుతూ
మా బతుకంత సాగాలి నీ చెంతనే చల్లగా
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సరా సరి మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సదాశివ మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
చరణం-2:
నీ గొంతున చేదు విసము
నీ కన్నుల కరుణామృతము
నీలోనే కొలువున్నాయంటా
నిను భక్తిగ చూసిన చాలు
మా చూపుల అభిషేకాలు
నిను చేరి తరియిస్తాయంటా
శ్రీరాముని దీవించి రామేశ్వరలింగా
ధర్మాన్ని గెలిపించి రక్షించావుగా
నిను భక్తిగ కొలిచింది రావణుడే అయినా
చెడు దారి పట్టిన తనని ఓడించావుగా
ఇక మాలోని చెడు మాయమవ్వాలని
నిను మనసార వేడేము వరమివ్వు మా శంకరా
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సరా సరి మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
హరోం హరోం హర హర హర హర హర
హరా హరా అని ఈ గాలి
సదాశివ మరి ఎదలను తడుముతు
జగం సమస్తం నిండాలి
సిరాశ్రీ
1. Music Director - Srinivas Sharma
2. Lyrics - Sirasri
3. Singer - Swarag Keerthan
4. Chorus:
i. Krishna Chaitanya
ii. Manoj Kuchi
iii. Sruthi Ranjani
iv. Meghana Naidu
5. Keyboard & Rythms - Sameer
6. Naadaswaram - Mallikarjun
7. Flute - Raghava Sai
8. Recordists:
i. Ganesh
ii. Nithin
9. Final Mixing & Mastering - Suresh Mallavarapu
10. Studios
i. Anna Audio Lab
ii. Sree Abheri Studios
Cast & Crew
Vikram
Vikranth
Vaishnavi
Anjana
Anuhya
Chethan
Ajay Kuruma
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: