స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు స్వచ్ఛంధ్ర కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్
Автор: STUDIO N9 NEWS
Загружено: 2025-04-19
Просмотров: 21
ఫైల్ నేమ్. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
తేదీ.19 04 25
స్థలము. కడప
యాంకర్.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పిలుపునిచ్చారు.స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల కిందట సీఎం పిలుపుమేరకు కార్యమ్రాలు కొనసాగుతున్నాయి.
అందులో భాగంగా ప్రతి మూడవ శనివారం ఈ–చెక్ అనే ధీమ్‌తో స్వచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పనికి రాని వైర్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వీకరించారు. తొలుత కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, జేసీ అదితిసింగ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవవీరెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఈ–వేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎలక్ట్రానిక్ వ్యర్థానలు సేకరించడం జరిగిందన్నారు. పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీటివల్ల అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం సేకరించిన వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. వివరించారు. ఇప్పటికే మన కడప స్వచ్ఛ కడప పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కొనసాగుతోందని వివరించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేసుకోగలమని తెలిపారు. ప్రజలు ఈ అంశాలపై చైతన్యవంతులై కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, అన్నిశాఖల జిల్లా అదికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: