Did Gandhi Oppose Ambedkar's Leadership? | Dr. Jayaprakash Narayan | (2/2) | Akella Raghavendra
Автор: JP Loksatta
Загружено: 2023-10-01
Просмотров: 30256
#gandhi #gandhijayanti #ambedkar
అంబేద్కర్ నాయకత్వాన్ని గాంధీ అడ్డుకున్నారా?
గాంధీ, అంబేద్కర్ ల మధ్య భావ సారూప్యం, భావ సంఘర్షణ ఉన్నాయని, పుట్టుకతో వివక్ష లేకుండా అందరికీ సమానావకాశాల కోసం గాంధీ అసాధారణ మానవీయ కృషి చేయగా అమానుష కుల వ్యవస్థ పీడన నుంచి వచ్చిన అంబేద్కర్ మార్పుని మరింత వేగంగా కోరుకుంటూ గాంధీతో సంఘర్షించారని.. దగా పడ్డ దళితులకు కమ్యూనల్ అవార్డ్ స్థానంలో రిజర్వుడు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో తన దృష్టిలో ఇద్దరూ పొరబడ్డారని, గాంధీ మరణానంతరం రాజ్యాంగ రచనా సమయంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుపై అంబేద్కర్ లేవనెత్తిన సహేతుక అభ్యంతరాలకి గాంధేయవాదులు సరైన పరిష్కారం చెప్పలేకపోయారని, గాంధీ, అంబేద్కర్ ల మధ్య సమన్వయం దేశానికి అత్యంత ప్రయోజనకరమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గాంధీ జయంతి ప్రత్యేక కార్యక్రమంలో పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ అక్కర్లేకుండానే, స్త్రీ అక్షరాస్యత పెద్దగా లేని కాలంలోనే అనేకమందిని నాయకురాళ్లుగా గాంధీ తీర్చిదిద్దటం, మహిళల పట్ల అణచివేతపై గాంధీ పోరాడిన తీరు, మహాత్ముడి కాలంలో కంటే ఈవేళ సమాజంలో విద్వేషం పెరిగిందా?, గాంధీ - పర్యావరణ పరిరక్షణ, మహాత్మా గాంధీని ఇవాళ్టి యువత ప్రాక్టికల్ గా ఎలా తమ జీవితాలకి అన్వయించుకోవాలి తదితర అంశాలపై ఈ రెండవ (చివరి) భాగంలో JP సమాధానమిచ్చారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: