క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టురట్టు6బుకీలుఅరెస్ట్ చేసిన పోలీసులు
Автор: MTelugunews
Загружено: 2025-11-05
Просмотров: 20
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు – ఆరుగురు బుకీలు అరెస్ట్
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తూ ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలను ప్రొద్దుటూరు పోలీసులు బట్టబయలు చేశారు.
ప్రొద్దుటూరు డిఎస్పీ భావన ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపింది. దర్యాప్తులో పదుల సంఖ్యలో కరెంట్ అకౌంట్లు తెరిచి వాటిని బెట్టింగ్ వెబ్‌సైట్లకు అనుసంధానం చేసినట్లు బయటపడింది. ఈ అకౌంట్ల ద్వారా వంద కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
చాపాడు మండలం చిన్న గురవలూరు గ్రామానికి చెందిన జగన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టు అయింది.
పోలీసులు ఆరుగురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.6,28,000 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 4 బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ చేసిన నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, ఆర్ధిక నేరాల దిశగా విచారణ కొనసాగుతోంది.
ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, "ఆన్‌లైన్ ట్రేడింగ్" పేరుతో పలు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు తెరిపించినట్లు పోలీసులు గుర్తించారు. పాత అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో కొత్త అకౌంట్లు తెరవడానికి బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తేలింది.
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ గారు ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు హాజరుపరచి వివరాలను వెల్లడించారు.
ఎస్పీ గారు మాట్లాడుతూ —
“క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు సమాజాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసాంఘిక వెబ్‌సైట్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం. అవసరమైన చోట ఈ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని డిజిపీ గారికి ప్రతిపాదనలు పంపాం,” అని తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: