PRIYANEWS రేణిగుంట గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్*
Автор: PRIYANEWS
Загружено: 2025-12-05
Просмотров: 5
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల నుంచి విముక్తంగా ఉంచే దిశగా పోలీసుల చర్యలు
శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు, రేణిగుంట ఎస్ డి పి ఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర మరియు వారి సిబ్బంది కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కార్ పార్కింగ్ సమీపం లో దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో ఓడిస్సా రాష్ట్రము కి చెందిన కైలాష్ బారిక, వయస్సు 29 సం//లు, తండ్రి పేరు సుభాష్ బారిక, పండర సహా వీది, శికుల గ్రామం మరియు తాలుక, గంజం జిల్లా, ఒడిస్సా రాష్ట్రము ,బాబు గౌడ్, వయస్సు 24 సం//లు, తండ్రి పేరు సుభాష్ గౌడ్, అను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న బ్యాగులులో 10 కిలోగ్రాముల గంజాయి (5 ప్యాకెట్లు), అంచనా విలువ రూ. 2, 00,000/- స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు ఈ గంజాయిని ఒడిశా నుండి తీసుకొని గుజరాత్ రాష్ట్రము లోని సూరత్ ఏరియలో ఉన్న చాహల్ అనే వ్యక్తికి అప్పగించాలనే ఉద్దేశంతో ఈ గంజాయి ని తరలించుతుండగా, మధ్యలో రేణిగుంట వద్ద దిగగా. పోలీసుల చాకచక్యంతో వారు పట్టుబడ్డారు.
అంతట పట్టు బడిన పై కనిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు పరిచి వారిని అరెస్ట్ చేసి తిరుపతి కోర్టు వారి వద్దకు రిమాండ్ నిమిత్తం పంపడం అయినది. పరారిలో ఉన్నచాహల్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చెయ్యడం అయినది.
ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్ర మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శ్రీ రవి మనోహరాచారి గారు మాట్లాడుతూ: "తిరుపతి జిల్లాను గంజాయి రహితంగా ఉంచడమే మా లక్ష్యం. ప్రజలు తమ పరిసరాలలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించి ఏవైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని. మనం కలిసికట్టుగా ఈ సామాజిక సమస్యను రూపుమాపాలి" అని తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: