CLASS 35 | Time In Tamil | spoken tamil through telugu | learn tamil from telugu | prabha palukulu
Автор: PRABHA PALUKULU
Загружено: 2020-08-27
Просмотров: 9492
#prabhapalukulu#timeInTamil#spokentamilfromtelugu#
CLASS 35 | Time In Tamil | spoken tamil through telugu | learn tamil from telugu | prabha palukulu
మణి- టైం
నేరం- సమయం
మణి ఎన్నావుదు
టైం ఎంతవుతోంది
మణి ఎన్న
టైమెంత
ఎన్నా మణి- టైమేంటి
నొడి- సెకన్
నిమిషం- నిమిషం
అవర్- గంట
ఒరు నిమిషం, రెండు నిమిషం...
ఒరవర్, రెండవర్, మూనవర్,
కాల్-పావు
అర- సగం
ముక్కాల్- ముప్పావు
మణి ఒన్నేకాల్- టైం ఒకటింబావు
రెండేకాల్- రెండుంబావు
మూనేకాల్-మూడుంబావు
నాలేకాల్- నాలుగుంబావు
అంజేకాల్, ఆరేకాల్, ఏలేకాల్
ఎట్టేకాల్, ఒంబోదేకాల్, పత్తేకాల్
పదినొన్నేకాల్, పనిరెండేకాల్
ఒన్ర- ఒన్ను+ అర..... ఒన్ర
రెండ్ర...... రెండున్నర
మూన్ర... మూడున్నర
నాల్ర.... నాలుగున్నర
అంజ్ర, ఆర్‌ర, ఏల్ర, ఎట్ర
ఒంబోద్ర, పత్ర, పదినొన్ర, పన్నెండ్ర
ఒన్నే ముక్కా(ల్)........ ఒకటి ముప్పావు
రెండే ముక్కా..........రెండుముప్పావు
మూనే ముక్కా........... మూడు ముప్పావు
నాలే ముక్కా........ నాలుగు ముప్పావు
అంజేముక్కా, ఆరే ముక్కా, ఏలే ముక్కా
ఎట్టేముక్కా, ఒంబోదేముక్కా, పత్తేముక్కా
పదినొన్నేముక్కా, పనిరెండేముక్కా
పావు తక్కువ ఒక్కటి, పావుతక్కువ రెండు
పావుతక్కువ మూడు అనేవి వాడరు
ఒకవేళ వాడాల్సి వస్తే....
ఒన్నుకు ఇన్ను పదినంజి నిమిషం కమ్మీ
రెండుకు అంజి నిమిషం కమ్మీ
మూనుకు పత్తు నిమిషం కమ్మీ
నీ కండింపా వేలైకు ఒంబోదు మణికి వరనో
నువ్వు తప్పకుండా పనికి 9గంటలకు రావాలి
నీ పత్తు మణికుల్ల వేలైల ఇరుకనో...
నువ్వు పదిగంటల్లోపల పనిలో ఉండాలి
ఒంబోద్రకు ఆఫీస్ తొరపాంగ
తొమ్మిదిన్నరకు ఆఫీస్ తెరుస్తారు
అదుకుల్ల నీ అంగే ఇరుకనో
ఆలోపు నువ్వు అక్కడ ఉండాలి
ఏంగా ఇప్పు మణి ఎన్న
ఏమండీ ఇప్పుడు టైమెంత
మణి ఒన్నావదు. నీంగ సాప్టింగ్లా
టైం ఒకటవుతోంది. మీరు తిన్నారా
ఇన్నుం సాపుడలే. అరవర్ కల్చి సాపుడువోం
ఇంకా తినలేదు. అరగంట తర్వాత తింటాం
నా కాలవర్ కల్చి వరువే. సేంది సాపిడ్‌లాం
నేను పావుగంట తర్వాత వస్తా. కలిసి తిందాం
ఇన్నొరుత్తన్ ఎత్తిన్ మణికు వరువా
ఇంకొకడు ఎన్ని గంటలకు వస్తాడు
అవన్ ఇరువదు నిమిషత్తుల వరువా
వాడు ఇరవై నిమిషాల్లో వస్తాడు
నీ ఇంగిరుందు అంజి నిమిషత్తుల పోనో
నువ్వు ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వెళ్లాలి
అవన్ పత్తు నిమిషముం నడకమాట్టా
అతడు పదినిమిషాలు కూడా నడవడు
కాల్ అవర్‌ల అంగే పోయి సేరనో
పావుగంటలో అక్కడికి పోయి చేరాలి
అరవర్‌ల నాన్ హీరో విజయై సందిక్క పోరే
అరగంటలో నేను హీరో విజయ్‌ను కలవబోతున్నా
ముక్కామణి నేరం కారుల పోనో
ముప్పావు గంట సేపు కారులో వెళ్లాలి
గంట, అరగంట, ముప్పావు గంట
అవన్ అరవర్‌ల సాపుడువాన్
అతడు అరగంటలో తింటాడు
నా నిక్కామె ఒరవర్ ఓడువేన్
నేను నిలబడకుండా ఒక గంట పరుగెడతా
అవల్ ఫోనిల్ ముక్కాల్ మణినేరం పేసిటాల్
ఆమె ఫోన్‌లో ముప్పావుగంట సేపు మాట్లాడింది
కాలై- ఉదయం
మదియం-పగల్... మధ్యాహ్నం
పిర్‌పగల్-మిట్టమధ్యాహ్నం
సాంద్రం- సాయంత్రం
రాత్రి, ఇరవు... రాత్రి
కాలైల పోయిటి ఇన్ను వరలే
పొద్దున పోయి ఇంకా రాలేదు
మదియం సాపుడ్‌ర నేరమాచ్చి
మధ్యాహ్నం తినే సమయమైంది
రాత్రి తూకమే వరలే
రాత్రి నిద్రే రాలేదు
అంద నేరత్తిల్ నీ ఎంగే ఇరుపే
ఆ సమయంలో నువ్వెక్కడ ఉంటావు
అంద నేరత్తిల్ వీట్‌లదా ఇరుపే, నీ వందురు
ఆ సమయంలో ఇంట్లోనే ఉంటాను, నువ్వు రా
ఇంద నేరత్తిల్ అవనై పుడికలాం
ఈ సమయంలో వాన్ని పట్టుకోవచ్చు
ఎంద నేరం అవన్ వీట్‌ల ఇరుపా
ఏ సమయంలో వాడు ఇంట్లో ఉంటాడు
ఎత్తని మనికి నా అంగే పోనో
ఎన్ని గంటలకు నేను అక్కడికి వెళ్లాలి
అత్తని నేరం ఎప్పుడి నిన్నిటిరుపే
అంతసేపు ఎలా నిలబడి ఉంటావు
ఉనకాగ ఎవ్ల నేరం కాత్తినిరుకనో
నీకోసం ఎంతసేపు ఎదురుచూడాలి
అంగే కొంజె నేరం ఎదిర్ పారు
అక్కడ కొంచెంసేపు ఎదురు చూడు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: