నమ్మదగిన దేవుడా ll Nammadagina Devuda ll telugu latest Christian song II SFJ SONG
Автор: Soldiers For Jesus AP & TS
Загружено: 2025-01-09
Просмотров: 25405
#latestchristiandevotionalsongs #teluguchristiansongs #SFJ #jesusteluguworshipsongs #sfjsongs #dhanamadaivama #soldiersforjesus
CREDITS:
Script: Bro. Mahesh SFJ
Music and lyrics: Mani Prakash
Vocals: Fani Bhushan
Sponsors: Bro. vijay kumar - Swarupa, Kothagudem
Video: Bro. Srikanth & Sagar SFJ
Lyrics:
నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడా
నీవిచ్చిన వాగ్ధానమే పరిచర్యకు ప్రారంభమే
వీగిపోని వాగ్ధానములు ఏటేటా నెరవేర్చిన -2
అను పల్లవి
మార్పు చెందని దేవా నీకే స్తోత్రము - మాట తప్పని దేవా అనంత స్తోత్రము - 2
చరణం 1
స్వాస్థ్యముగా బహు జనములను సొత్తుగ భూదిగంతములను - 2
నన్నడిగిన నీకిచ్చెదనంటూ వాగ్దానము చేసిన దేవా
నీ నోటిని బాగుగా తెరువుము తప్పక దానిని నింపెదనంటూ
ఎక్కలేని ఎత్తైన కొండ మీదను దావీదును స్థిరపరచిన దేవా //మార్పు//
చరణం 2
నేను చూపించు దేశముకు - సందేహము లేక వెళ్ళుము -2
కాలు మోపిన స్థలములన్నిటినీ స్వాస్థ్యముగా నీకిచ్చెదనంటూ
మోషేకు తోడైయున్న రీతిగా నీకును తోడైయుందుననీ
ఎన్నటికీ ఎడబాయననీ యెహోషువాను ధైర్యపరచిన. //మార్పు//
చరణం 3
రెండు పాళ్లుగా ఆత్మను ఎలీయా నుండి ఎలీషాకు - 2
ఉన్నత పరిచర్య నిమిత్తము గొప్ప కార్యములు చేయుట కోసము
ఆత్మ ద్వారా ఎన్నో విజయములు పొందగ శిష్యుల ధైర్య పరచిన
భూదిగంతములను చేరగా బలహీనులనే ఎంచి నిలిపిన //మార్పు//
అబ్రహాము దేవుడవే - దావీదునకు దేవుడవు
మోషే భక్తుని దేవుడవే - యెహోషువకూ దేవుడవు
ఏలీయా యొక్క దేవుడవే – ఎలీషాకు దేవుడవు
అపోస్తులులకు దేవుడవే - నేడును మాకు దేవుడవు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: