కష్టం నీకు తెలియకుండా పెంచినారే నిన్ను కన్నవాళ్ళు
Автор: KVS
Загружено: 2026-01-11
Просмотров: 609
#love #music #new #song #emotional
HI FRIENDS
THIS IS MY NEW LYRICAL SONG
LYRICS BY PUSHPA
LYRICS
కష్టం నీకు తెలియకుండా
పెంచినారే నిన్ను కన్నవాళ్ళు
కష్టము తప్ప ..
సుఖములు తెలియని
జీవితాలే మావి
ఎట్లా నన్ను ప్రేమించావు తెలియదులే నువ్వు
మిద్దెలో నువ్వు పుట్టినావు
ముద్దు ముద్దుగా పెరిగినావు..
మట్టిలో పుట్టిన నేను
గుడిసెలో పెరిగినాను నేను
అటువంటి నన్నే నువ్వు ప్రేమించావా...
నీ ప్రేమతో నన్ను నడిపించేవా..
మనువాడమంటూ కన్నవారిని కాదనుకున్నావా
అయినవాళ్లనే వద్దనుకుంటూ
మిద్దెను వదిలి
గుడిసెకు నువ్వు
కదిలి వచ్చావా
నా గుండె కదిలించావా
గుడిసెలో బ్రతుకులు సులభము కాదే.
కష్టము తప్ప
సుఖమే తెలియని బతుకులు మావి
ఎట్లా నిన్నే ఉంచేది ఈడ
ఎండ కన్ను ఎరుగని
సుకుమారివి..
కాళ్లు కందని రాకుమారిలా పెంచారే నిన్ను
అట్లాంటి నిన్ను గుడిసెల్లో ఉంచేది ఎట్లా
గంజి నీళ్లు ఇచ్చేది ఎట్లా
పట్టుపరుపుల మీదే పడుకుంటావే నువ్వు
కటికి నేల మీదే
పడుకోబెట్టేది ఎట్లా
పట్టుచీరనే కట్టి
పసిడి బంగారం పెట్టి
పుత్తడిబొమ్మగా నడిచేస్తుంటే చూసిన కళ్ళతో ఇట్లా నిన్ను చూసేది
నీ తలరాతనే తిరిగి రాసేది
గుడిసెలే బతుకు
కొత్త కావచ్చు
మనసున్న మనిషి
పక్కన ఉంటే
నరకం కూడా
స్వర్గంలాగా అనిపిస్తుంది
ఒక్కపూట తిన్న...
ఒక్క పూట ఉన్న ..
ఒకరికి ఒకరే ఉంటాముగా
ప్రాణం కన్నా మిన్నగా..
పుస్తెలతాడు మెడలో కట్టి
నా దానిగా నిన్ను చేసుకుంటా
మిద్దెలు మేడలు లేవు కానీ
ప్రాణంగా నిన్నే చూసుకుంటా
నా ప్రాణం నువ్వే అంటానులే..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: