కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా | Karuninchi Thirigi Samakoorchu Prabhuva | Christian Song
Автор: Life Changing Messages
Загружено: 2021-05-17
Просмотров: 2645
ఆధ్యాత్మిక మహా పోరాటం | Spiritual Warfare | Day157 | A S Ranjeet Ophir | 18-5-21
Reference: దావీదు సమస్తమును సమకూర్చుకొనెను 1 సమూయేలు Samuel 30:19
పల్లవి: కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా - క్షమాపణ నిన్ను వేడుచున్నాను
1. దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే
2. శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
3. పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
4. ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా
5. పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా
6. ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
7. పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా
8. చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: