పెందుర్తి మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ అవగడ్డ జ్యోతిఅప్పలనాయుడు ప్రమాణ స్వీకారం | Pendurthi ||VTalkTv
Автор: V talkTV
Загружено: 2025-08-28
Просмотров: 241
అంగరంగ వైభవంగా పెందుర్తి మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
భారీ ర్యాలీతో తరలివచ్చిన నూతన ఛైర్ పర్సన్ డాక్టర్ అవగడ్డ జ్యోతి
పెందుర్తి మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మార్కెట్ కమిటీ నూతన ఛైర్ పర్సన్‌గా డాక్టర్ అవగడ్డ జ్యోతితో విశాఖ ఎంపీ శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు పులగానిపాలెంలోని తన ఇంటిదగ్గర నుండి భారీ ర్యాలీగా బయల్దేరి వచ్చారు జ్యోతి. ఈ కార్యక్రమంలో జ్యోతి, అప్పలనాయుడు అనుచరులు, కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పులగానిపాలెం నుంచి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం దాకా నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పూలు చల్లుతూ ముందుకు కదిలారు. దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం చోటు చేసుకుంది. తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రజలు, కూటమి పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు.
నూతన ఛైర్‌పర్సన్‌గా ప్రమాణం చేసిన జ్యోతి.. మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీల నాయకులు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
మార్కెట్ అభివృద్ధికి సీఎం చంద్రబాబును ఒప్పించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు గండి బాబ్జీ. ఇందుకు నూతన పాలక సభ్యులంతా సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముమ్మన దేముడు, బల్ల శ్రీనివాసరావు, సేనాపతి వసంత లక్ష్మి, కన్నా, టిడిపి నాయకులు రెడ్డి నారాయణరావు, గండి వంశీ, దైలి రమణ, తదితరులు పాల్గొన్నారు.
For more updates and Interesting Video Please Subscribe us
/ @vtalktv
#avagaddajyothiappalanaidu #avagadda #jyothi #appalanaidu #pendurthi #pulaganipalem #tdp #Pendurthimarketchairman #trending #aplatestnews #breakingnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: