Certificates Distribution, MUDALAYIRAM SATTUMURAI🙏యోగ్యత పత్రముల పంపిణీ, ముదలాయిరమ్ శాత్తుముఱై
Автор: Padmaja Ramanujadasi
Загружено: 2025-10-18
Просмотров: 1141
యతిరాజనాథవల్లి గోష్ఠి ముదలాయిరమ్ కాలక్షేప సమాపనోత్సవం (ముగింపు) సందర్భంగా ది.13-10-2025న పది ప్రబంధాలలో అన్వయించిన వారికి యోగ్యత పత్రములు (Certificates) శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి శ్రీహస్తములతో అనుగ్రహించబడ్డాయి.
#sattumurai
#samapana_mahotsavam
#mudalayiram_sattumurai
#devotional
#closingceremony
#perumal_thirumozhi
#kulasekhara_perumal
#kulasekhar_azhwar
#srirangam
#thirumala
#5years_of_ynv_goshti
#5th_anniversary
#yathirajanadhavalli_goshti
#padmajaramanujadasi
#acharya_vaibhavam
#ramanuja_vaibhavam
#bhagavad_ramanuja
#thirunakshatram
#divyadesalu
#samasrayanalu
#vaishnava_sampradayam
#srivaishnavism
#bhagavadvishayam
#alwar
#azhwar
#andal
#goda
#krishna
శ్రీమతే రామానుజాయనమః
విశ్వవిఖ్యాత యతిసార్వభౌములు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి దివ్యమఙ్గళాశాసనాలతో...
శిష్య సులభులు, ప్రేమైకమూర్తి, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారు మరియు
శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామివార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన
ముదలాయిరమ్ సమాపన మహోత్సవము
విలక్షణమైన శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణుని దివ్యాయుధాలు, దివ్యాభరణాలు ఇత్యాది అంశలుగా పన్నిద్దరు ఆళ్వార్లు ఈ భువిపై అవతరించి 24 దివ్యప్రబంధాలను మనకు కృప చేసారు. శ్రీమన్నాథమునులు ఈ దివ్యప్రబంధాలలోని నాలుగు వేల పాశురాలను నాలుగు ఆయిరములుగా అనగా ముదలాయిరం, పెరియతిరుమొழி, ఇయఱ్పా, తిరువాయ్మొழி గా విభాగించారు. వీటిలో జీవుడ్ని బాధించే "దేహాత్మాబుద్ధి" ఇత్యాది ఆరు రుగ్మతలను తొలగించే దివ్య ఔషధమైన "తిరునారాయణ అష్టాక్షరీ మహామంత్రము" యొక్క ప్రతిపాదకముగా మొదటి మూడు ఆయిరములను, "ద్వయార్ధ ప్రతిపాదకము"గా తిరువాయ్మొழிని ప్రస్తుతిస్తారు.
పరమోత్కృష్టమైన ఈ నాలాయిర దివ్యప్రబంధములను సంతపాఠంతో, వ్యాఖ్యాన సహితంగా అర్ధానుసంధానం చేయాలనే సత్సంకల్పంతో ది.26-03-2020న కేవలం 20మందితో ఆన్లైన్లో ప్రారంభమయిన మన యతిరాజనాథవల్లి గోష్ఠి ఆళ్వారాచార్యుల అనుగ్రహంతో నేడు 40,000మందితో పెరియగోష్ఠిగా మారింది. అంతేకాక, తిరువాయ్మొழிకి ఈడువ్యాఖ్యానం అధికరణ పూర్తి చేసుకున్న సందర్భంగా గత సంవత్సరం అనగా ది.28-03-2024న విజయవాడలోని A+ కన్వెన్షన్ ఫంక్షను హాలునందు శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారు మొదలుగా తొమ్మిదిమంది ఆచార్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా నభూతో నభవిష్యత్ అన్న చందంగా భగవద్విషయ సమాపన మహోత్సవము జరుపుకోవడమైనది.
ఇప్పుడు మొదటి వెయ్యి పాశురాలైన ముదలాయిరంలోని "ప్రణవార్ధ ప్రతిపాదకములు" అయిన తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొழி, తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొழி, పెరుమాళ్ తిరుమొழி, తిరుచ్చన్దవిరుత్తమ్, తిరుమాలై, తిరుప్పళ్ళియెழுచ్చి, అమలనాదిపిరాన్ మరియు "నమః శబ్ద అర్ధ ప్రతిపాదకము" అయిన కణ్ణినుణ్ శిఱుత్తామ్బు అనే ఈ పది దివ్యప్రబంధములను వ్యాఖ్యాన సహితంగా అధికరించి, శాత్తుముఱై జరుపుకోవడమైనది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ ముదలాయిరమ్ శాత్తుముఱై (సమాపన మహోత్సవము) ది.13-10-2025 సోమవారమునాడు విజయవాడకు అతిసమీపంలోని పెనుమాక, శ్రీవైష్ణవ మహాదివ్యక్షేత్రము నందు ఉదయం 8.30గంటల నుండి ప్రారంభమయి పర్వదినంలా జరిగింది.
భగవద్విషయ సమాపన మహోత్సవమునకు వేంచేసిన మహనీయులు:
👉 శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారు, విజయవాడ
👉 శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామివారు, విజయవాడ
👉 ఉ.వే. శ్రీమాన్ ఈయుణ్ణి శింగరాచార్య స్వామివారు, నరసాపురం
👉 ఉ.వే. శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులవారు, భద్రాచలం
👉 ఉ.వే. శ్రీమాన్ మరుధూరి నరసింహాచార్యులుగారు, మఙ్గళగిరి
👉 ఉ.వే. శ్రీమాన్ చించాపట్టణ గోమఠం మోహనాచార్యులవారు, తెనాలి
ముదలాయిరమ్ పది ప్రబంధాలలో అన్వయించిన వారికి భగవద్విషయ అధికరణ ధృవీకరణ పత్రములు (యోగ్యత పత్రములు - Certificates) శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి శ్రీహస్తములతో అనుగ్రహించబడ్డాయి.
ఈ బృహత్కార్యక్రమంలో అన్వయించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తూ...
అడియేన్ రామానుజదాసి
(పసుమర్తి పద్మజకుమారి)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: