Sri Bhusametha SriVenkateswara Swamy Temple Trust,
Автор: Sri Bhusametha SriVenkateswara Swamy Temple Trust
Загружено: 2024-08-27
Просмотров: 107
ఓం నమో వేంకటేశాయ।
ఓం నమో భగవతే వాసుదేవాయ
డోకిపర్రు మహాక్షేత్రంలో శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయమున ప్రతిష్టా సందర్భముగా వేంచేసినటువంటి స్వామి వారి అనంత వైభవం దినదినాభివృద్ధి చెందుతూ నలు దిశలా వ్యాపించి అభినవ తిరుమలగా విరాజిల్లుతున్నది.
ప్రతిష్ట మొదలు, ఈ మహాక్షేత్రములో వారోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవములు అతి ఘనముగా తిరుమల ప్రమాణముగా వైఖానస భగవచ్చాస్త్ర విధానంగా నిర్వహించుచున్నాము. ప్రతి సంవత్సరము కూడా వేలాది భక్తులను అనుగ్రహించుటకు నూతన సేవలను తిరుమల వలె అశేష భక్తులకు తిరుమలను గుర్తు చేస్తూ స్వామి కైంకర్యములలో పాల్గొనే సౌలభ్యము కల్పించుచున్నాము.
ఈ సంవత్సరము మునిపటివలె భక్తుల యొక్క ప్రార్ధనలు నెరవేర్చుకొనుటకు విశేష సేవలు ప్రతిపాదించుచున్నాము. జ్ఞానాభిరుద్ది
కొరకు సరస్వతి యాగము, సంపద సౌభాగ్యములకు లక్ష్మి యాగము, వంశాభివృద్ధి కొరకు పుత్రకామేష్టియాగం, ఆరోగ్యమునకు
నవగ్రహ హోమము, సర్వ సౌభాగ్యములకు సుదర్శన హోమము, శ్రీ వేంకటేశ్వర మహత్య వ్రతము ప్రారంభించుచున్నాము. ఈ
సేవ కైంకర్యములలో పాల్గొనుటకు మా నిర్వహణ కార్యకర్తలను సంప్రదించగలరు.
ఈ దేవాలయము మనందరిది. స్వామి వారి సేవలలో మీరందరు పాత్రధారులు కాగలరని, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మా విజ్ఞప్తి.
.
.
.
.
.
Subscribe to us on:
Facebook: / sbsvsd
Instagram: / sbvtdevasthanam
Youtube: / @sbvtdevasthanam
#dokiparru #dokiparrutemple #sbvt #lordbalaji #lordvenkateshwara #sbvt #meil #review #hindutemple #krishnadistrict
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: