కుప్పం మహిళ ఘటనపై డిఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం.
Автор: K4 TV
Загружено: 2025-06-17
Просмотров: 2994
DSP Parthasarathi's media conference on the Kuppam woman incident.
#kuppampolice #kuppamdsp #kuppamnews #kuppamlive #kuppamwomen
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డి.ఎస్.పి పార్థసారథి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునియప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధ్యత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టినట్లు తెలిపారు. తమకు సమాచారం అందగానే పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశామని తెలిపారు. శిరీష తమ పిల్లలను తీసుకొని సోమవారం గ్రామానికి వచ్చిన నేపథ్యంలో శిరీషపై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి చెట్టుకు కట్టివేశారని, ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టబోతున్నట్లు అన్నారు. అరెస్టు చేసిన నలుగురును రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: