పరమగీతము ధ్యానములు // Message by పాస్టర్ ఎం. సైలస్ గారు // 19 డిసెంబర్ 2025
Автор: JPH pydibheemavaram
Загружено: 2025-12-19
Просмотров: 63
తేదీ : 19 డిసెంబర్ 2025
శుక్రవారం
యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం
పైడిభీమవరం
వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు
అంశం*: *షారోను పొలము రెండవ భాగం
మూలవాక్యం :
పరమగీతము 2:1
నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
ఆదికాండము 24:63
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,
ఆదికాండము 24:64
రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి
ఆదికాండము 24:65
మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడుఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
1. ధ్యానించే పొలము
★ ఇస్సాకు ధ్యానము చేయడానికి పొలమునకు వెళ్ళాడు.
★ వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి.
కీర్తనలు 1:2
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
★ దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు.
కీర్తనలు 63:4
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
కీర్తనలు 63:5
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
★ క్రొవ్వు బలమునకు సూచన
★ దేవుని వాక్యమును ధ్యానించడం వలన దావీదునకు ఎన్ని శ్రమలు వచ్చినా అపాయములు కలిగినా బలము కలిగి జీవించాడు.
★ మెదడు జ్ఞానమునకు సూచన
★ దావీదు వాక్యమును ధ్యానించడం వలన జ్ఞానమును పొందుకున్నాడు.
★ దావీదు వాక్యమును ధ్యానించడం వలన తన ప్రాణమునకు తృప్తి పొందుకున్నాడు
★ దావీదు దేవుని వాక్యమును ధ్యానించడం వలన సంతోషము పొందుకున్నాడు.
దేవుని వాక్యమును ధ్యానించడం వలన
1. బలము పొందుకుంటాము
2. జ్ఞానము పొందుకుంటాము
3. తృప్తి పొందుకుంటాము
4. సంతోషాన్ని పొందుకుంటాము
ఆదికాండము 29:1
యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
ఆదికాండము 29:2
అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూతవేసి యుండెను.
2. ఒక బావి ఉన్న పొలము
యోహాను 4:14
నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
★ ఒక బావి యేసు క్రీస్తు ప్రభులవారికి సాదృశ్యం
★ దేవుడు ఇచ్చే నీళ్ళు త్రాగే వారిగా ఉండాలి అనగా క్రీస్తు పోలికగా జీవించేవారిగా ఉండాలి.
1కోరింథీయులకు 11:1
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
మత్తయి 2:1
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
మత్తయి 2:2
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
★ నక్షత్రం క్రీస్తు పోలికగా జ్ఞానులను యేసయ్య వద్దకు ఎలా నడిపించిందో ఆ విధముగా అనేక మందిని యేసయ్య వద్దకు నడిపించే విధముగా క్రీస్తు పోలికను కలిగి ఉండాలి.
2రాజులు 4:39
అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్ష చెట్టును చూచి, దాని గుణ మెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.
2రాజులు 4:40
తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినకమానిరి.
3. వెఱ్ఱి ద్రాక్ష చెట్టు ఉన్న పొలము
ద్రాక్షావళ్ళి యేసయ్యకు సాదృశ్యం
వెఱ్ఱి ద్రాక్షవళ్ళి సాతానుకు సాదృశ్యం
★ ఎలీషా గిల్గాలు ప్రాంతమునకు వెళ్ళినప్పడు కరువులో ఉన్న సమయంలో శిష్యుడును కూరాకులు తెమ్మని పంపిన సమయంలో శిష్యుడు కూరాకులకు బదులు గ్రహింపు లేక వెఱ్ఱి ద్రాక్షలను తీసుకు వచ్చాడు.
★ సాతాను కార్యములను గ్రహింపు కలిగి వాటికి దూరముగా ఉండాలి.
★ వాక్యము మన హృదయంలో ఉంటే గ్రహింపు కలిగి జ్ఞానం కలిగి జీవిస్తాము.
హెబ్రీయులకు 11:24
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
హెబ్రీయులకు 11:25
అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
హెబ్రీయులకు 11:26
ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.
★ మోషే ఐగుప్తు దేశములో యువరాజుగా ఉన్న సరే వాక్య జ్ఞానం కలిగి ఐగుప్తులో ఉన్న పాపము తన వద్దకు రాకుండా గ్రహించి పరిశుధ్ధత కలిగి అల్పకాల సుఖభోగములకు దూరముగా ఉండి ఇశ్రాయేలు ప్రజల కోసం శ్రమ అనుభవించడం మేలుగా ఎంచుకున్నాడు.
దేవుడు మనలను దీవించును గాక
ఆమేన్
ప్రార్ధనా అవసరతలకు : 9441804941
మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
యూట్యూబ్ చానల్ 👇🏻
/ @jph_pydibheemavaram
వాట్సప్ చానల్ 👇🏻
Follow the JPH PYDIBHEEMAVARAM channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6E...
Instagram channel
https://www.instagram.com/jphpydibhee...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: