Raichur Special Ragi Mudda | Mutton Curry | Natu Kodi Kura | Jonna Rotte | Raichur Food | Food BooK
Автор: Food Book
Загружено: 2023-03-16
Просмотров: 105339
కర్ణాటకలోని బళ్లారి, హోసపేట,రాయచూరులలో రాగి ముద్ద,జొన్న రొట్టె ఇలా మరెన్నో అలనాటి బలవర్ధకమైన ఆహారాలకు విశేషమైన ఆదరణ ఉండటం గమనించాను నా ఆహార విహారాన.శాఖాహారం మరియు మాంసాహారంతో ఆయా సంప్రదాయ మేటి వంటకాలు లభించు కేంద్రాలు విరివిగా కనిపించాయి.ఆ విధంగా మన పూర్వీకులు అలవరిచిన సంప్రదాయ వంటక విధానం గౌరవింపబబడటం శుభపరిణామం.
హళ్లి మనే అంటే పల్లె విందు..పేరుకే పరిమితం కాకుండా అనర్ధకాలు వినియోగం అవ్వకుండా నాటు తరహాలో గ్రామీణ వంటకాలను అభిగుణంతో వండి వడ్డన చేస్తూ తమ ఆహారశాలకు సదభిప్రాయం తెచ్చుకున్నారు నిర్వాహకులు.
దృశ్యంలో కనబడు ఆహార అందం వీక్షణ పిదప..బహుశా మీకు విధితమవుతుందనుకుంటన్నా ఇచ్చట ఆహార నేపథ్యం.చూడండి మన నుండి ఎంత ఇష్టతను పొందుతాయో..
తయారీలో ఇనుమిక్కిలిగా శుభ్రత
పాటించారు.మిత మషాలనే వనరిక చేశారు.
శోభగు కల్పించుటకు,రుచి సమీకరణ కొరకు ఇబ్బంది కలిగించే కారకాలకు చోటివ్వకపోవడం అభినందనియం.
ప్రతికూరలోను మాంసం తాజాగా ఉంది,ముక్క పట్టుగా చిక్కేలా పులుసు సారముగా ఉండేలా వండారు. ప్రధాన మూల పదార్థాలైన ఉప్పు, కారం, సుగంధ ద్రవ్యాలు ప్రభావితం కాకుండా నాలుకకు హితంగా బొజ్జకు సన్నిహితంగా వంటకము చేపట్టి స్వీయ శైలి విశేషము చాటారు.
అంతిమంగా ఇక్కడ నా ఆహార ఆస్వాధన పట్ల సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.
ఆహార శాల గూగుల్ లింక్:-
https://g.co/kgs/RC16yu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: