TELUGU STORIES - ఊరి చివర రైతు | Moral Stories in Telugu | Telugu Kathalu | Mahesh Studios Telugu
Автор: Mahesh Studios
Загружено: 2025-11-14
Просмотров: 26949
TELUGU STORIES - ఊరి చివర రైతు | Moral Stories Telugu | Telugu Kathalu | Mahesh Studios Telugu
#ఊరి_చివర_రైతు
#telugu #telugukathalu #telugustories #telugumoralstories #neethikathalu #teluguneethikathalu #bommalakathalu #bommalu #storiesintelugu
#maheshstudios
Who work For This Channel
Writer : Dhruvansh
Voice over artist : Mounisha ,Anusha, Anu , Ramesh ,
Studios : Sai Star Studios
Story Board : Gangadhar Nakkala
Animation HOD : L Chiatanya.Pawan
Animators : Nikil Bro , Deepak,Pawan
Editor : SaiNath
Producer : Mahesh Mama
Technical Support : Vamshi VS
more 20+ People working For this channel
Thank you
Concept of The Video :
పార్వతీపురం అను గ్రామంలో గంగవ్వ . ఆమె మనవడు శంకరయ్య అతని భార్య శారద వీరు పేదవారు అయినప్పటికీ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు.. వీరికి కొంత సొంత భూమి ఉండడంతో అందులో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు..ఒకరోజు గంగవ్వ తన మనవడితో...
గంగవ్వ : శంకరయ్య వర్షాలు మొదలవుతున్నాయి అందరూ నాట్లు వేస్తున్నారు. మనం ఎప్పుడయ్యా నాట్లు వేసేది అందరూ వేశాక మనం వేస్తే మన కోత వెనుకబడిపోతుంది..
శంకరయ్య : అవ్వ ఆ పని కోసమే కూలి వాళ్ళ కోసం ఇప్పుడే పక్క గ్రామానికి వెళ్ళొచ్చాను నలుగురు కూలి వాళ్ళు దొరికారు నాటు వేయడానికి...
గంగవ్వ : నలుగురా ! నలుగురూ ఏం సరిపోతారు అయ్యా ఒక ఐదాఆరుగురున్న ఒక మాదిరిగా సరిపోయెవారు.
శంకరయ్య : మరేం చేస్తాం అవ్వ. ఇప్పుడు కూలి వాళ్ళు దొరకడమే మహా కష్టంగా ఉంది..అని అనుకుంటూ ఉండగా..శంకరయ్య భార్య శారద
శారద : ఏవండీ ఆ నలుగురితో పాటు మనిద్దరం కూడా కలిసి పనిచేస్తే సరిపోతుంది కదండీ..
మీరు వరి కట్టలు వేయండి. నేను కూలీవారితో నాటు వేస్తాను..
గంగవ్వ : మంచి ఆలోచన అమ్మ..మీరు వెంటనే పనికి సిద్ధం కాండీ..నేను మీకు సద్ది (క్యారేజ్) కడుతాను..అంటూ భోజనం తయారు చేసి సద్ది కట్టి శంకరయ్య, శారదాను పొలం దగ్గర పంపిస్తుంది..
వీరు వెళ్లేసరికి ఆ నలుగురు ఆడవాళ్లు నటువేయడానికి పొలం దగ్గరికి వచ్చి ఉంటారు...వారిని చూసి
శంకరయ్య : రంగమ్మక్క వచ్చారా రండి..నాటు వేద్దాం..
రంగమ్మక్క: మీరే ఆలస్యం తమ్ముడు..అంటూ పొలంలోకి దిగుతారు.. శంకరయ్య వరి కట్టలు వేస్తుంటే శారద శారదతో పాటు ఆ నలుగురు ఆడవాళ్లు నాటు వేస్తూ ఉంటారు.
వీరు నాటు వేస్తూ ఉండంగా అదే గ్రామానికి చెందిన జమీందారు గారి పొలం శంకరయ్య పొలం పక్కనే ఉంటుంది.. వారు కూడా నాటు వేస్తూ ఉంటారు . కొంత సమయానికి వరినాటు ఎలా వేస్తున్నారని జమీందారు ఉపేంద్ర గారు తన పాలేరుతో కలిసి పొలం దగ్గరికి వస్తాడు...
జమీందార్ ఉపేంద్ర : (తన పాలేరుతో )లింగయ్య మనతోపాటు ఆ శంకరయ్య వాళ్ళు కూడా నాటు వేస్తున్నారు అనుకుంటా..
లింగయ్య : అవునయ్యా నాటు వేయించడమే కాదు తాను కూడా వరికట్టలు వేస్తున్నాడు.. ఎలా అయినా శంకరయ్య కష్టజీవయ్య ఒకరి కష్టానికి ఎప్పుడు ఆశపడడు..
జమీందార్ ఉపేంద్ర : మేము పనికిమాలిన జీవులమా మేము వరికట్టలు వేస్తాం మాకు వచ్చు ఇప్పుడు నా తడాఖా ఏంటో చూపిస్తా చూడురా లింగ అంటూ ఆడవాళ్లు నాటు వేస్తుండగా బురదగా ఉన్న మడిలో (పొలంలో ) దిగుతాడు. జమీందార్ గారు అడుగు తీసి అడుగు వేసే లోపు జారి కింద పడతాడు అది చూసి నాటు వేస్తున్న ఆడవాళ్ళందరూ నవ్వుతారు..
లింగయ్య : అయ్యయ్య అయ్యయ్యో! కింద పడ్డారా అందుకే అంటారయ్యా పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దని మనకెందుకయ్యా గెట్టు దగ్గర ఉండి నక్కినక్కి చూడకుండా....
జమీందార్ ఉపేంద్ర : అరేయ్ లింగ ముందు మాటలు ఆపి నన్ను ఒక చేయి వేసి లేపరా..
లింగయ్య : అయ్యా మీరేమైనా బక్కగా ఎలక పిల్లలా ఉన్నారా? పందిల ఏనుగు పిల్లలా ఉన్నారు.. ఆగండి లేపుతాను అంటూ రెండు చేతులు పట్టి గట్టిగా లేపుతాడు..జమీందార్ లేచి.....continue on video 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: