సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న సిబిఐ ఐజీ శ్రీ వీరేష్ ప్రభు
Автор: AksharaVision News
Загружено: 2025-12-20
Просмотров: 11
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న సిబిఐ ఐజీ శ్రీ వీరేష్ ప్రభు
సింహాచలం, డిసెంబర్ 20 (శనివారం):
కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) హైదరాబాద్ జోన్ హెడ్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) శ్రీ వీరేష్ ప్రభు, IPS గారు శనివారం ఉదయం సింహాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న శ్రీ వీరేష్ ప్రభు గారికి, విశాఖపట్నం సిబిఐ డిఐజి శ్రీ మురళీ రంభ, IPS గారు మరియు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రాదా, సహాయ కార్యనిర్వహణ అధికారి కె. తిరుమలేశ్వరరావు, మరియు పర్యవేక్షణ అధికారి శ్రీ బి. సత్య శ్రీనివాస్ గారు ఐజీ గారికి ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానం పలికారు.
స్వామివారి దర్శనం మరియు పూజా కార్యక్రమాలు:
ఆలయ సంప్రదాయం ప్రకారం, ఐజీ గారు ముందుగా భక్తుల కోర్కెలు తీర్చే 'కప్పస్తంభాన్ని' ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం అంతరాలయంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీ వీరేష్ ప్రభు గారిని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబిఐ అధికారులు మరియుఆలయ పర్యవేక్షణాధికారి సునీల్ కుమార్ ఆలయ పి ఆర్ ఓ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: