గాంధీనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు | Ramana Guru Swamy | Pendurthi in Vizag||VTalkTv
Автор: V talkTV
Загружено: 2025-04-14
Просмотров: 138
గాంధీనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీశ్రీశ్రీ విస్సు సంవత్సరాది వేడుకలు
పెందుర్తి పరిధిలోని ఉడా కాలనీ గాంధీనగర్ అయ్యప్ప స్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. 14 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ విస్సు సంవత్సరాదిని పురస్కరించుకొని సోమవారం నాడు విశేష పూజలు జరిపారు. వినాయక పూజ, పుణ్యహచనం, లక్ష్మీ గణపతి హోమంతో పాటు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, అయ్యప్పస్వామి సేవా సంఘం అధ్యక్షులు రమణగురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని తరించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తారు.
వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి ఇష్టమైన సోమవారం రోజు ఆయన పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రోజురోజుకు హిందువుల్లో భక్తి భావం పెరుగుతుందని చెప్పారు రమేష్ బాబు. సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దైవచింతనలో ఉంటే ప్రజలు తప్పు చేయడానికి భయపడతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కళింగ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
For more updates and Interesting Video Please Subscribe us
/ @vtalktv
#ayyappaswamytemplependurthi #pendurthiayyappaswamytemple #ayyappatemple #ayyappaswamytemple #ayyappatemplependurthivisakhapatnam #uttarandhraayyappatemplependurthi #uttarandhraayyappatemple #pendurthiayyappaswamitemple #ayyappaswamitemplenearpendurthy #ayyappatemplependurthi #pendurthiayyappaswamy #trending #aplatestnews #breakingnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: