పర్యావరణాన్ని ప్రజలే కాపాడుకోవాలి
Автор: EYE FOCUS MEDIA
Загружено: 2025-11-25
Просмотров: 8
కార్పొరేట్స్ తో పాలకులు మిలాఖత్...
పర్యావరణాన్ని ప్రజలే కాపాడుకోవాలి... పిలుపునిచ్చిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి వి గోపాల్ గౌడ్
విశాఖపట్నం, న్యూస్ లీడర్, నవంబర్ 25: కార్పొరేట్స్ తో పాలకులు కలిసి పోయారు కాబట్టి పర్యావరణాన్ని ప్రజలే కాపాడుకోవాలని మాజీ సుప్రీం కోర్ట్ జడ్జి వి గోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం డాబా గార్డెన్స్, ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఉద్యమ భాగస్వామి బొలిశెట్టి సత్యనారాయణ సతీమణి ఇటీవల మరణించడంతో, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖకు రావడం జరిగిందన్నారు. పర్యావరణంపై ఆమె అనేక కార్యక్రమాలలో తమతో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేసుకున్నారు. కలుషితమవుతున్న నదులను, చెరువులను, ఆనకట్టలను పరిరక్షించుకోవాలని, మంచి ఆక్సిజన్, నీరు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, నేడు అది కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజ్యాంగం చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అమెరికా, చైనా దేశాల కంపెనీలు గ్లోబల్ వార్నింగ్ కి కారణమవుతున్నరన్నారు. మానవులకు మంచి ఆమ్ల జనితం, నీరు అవసరమని నదులను పరిరక్షించాలని రాజ్యాంగంలో రాసుకున్న, పట్టించుకునే వారు లేక అన్ని నదులు కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు పర్యావరణాన్ని అరికట్టగలమని, చైతన్యం పరిచే బాధ్యత మీడియా ప్రతినిధులపై కూడ ఉందని స్పష్టం చేశారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్, ఆరిలోవ ముడసర్లోవ డంపింగ్ యార్డ్, పర్యావరణంపై మాట్లాడారని, ఇప్పుడు అది వదిలేసారన్నారు. సత్యం కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి నేడు దాపురించింది అన్నారు. మానవ సహజ సంపదను కార్పొరేట్స్ కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై దేశం ఆధారపడి ఉందని, నేడు నూతన ఆర్థిక విధానాల వలన అది కూడా ధ్వంసం అవుతుందన్నారు. రైతులకు దిగువ స్థాయికి వెళ్ళిపోతున్నారని, కార్పొరేట్స్ పై స్థాయికి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలిగించే కర్మాగారాలను ఇతర దేశాల్లో మూయిస్తే, మన దేశంలో ఆ కంపెనీలను మన పాలకులు పెట్టిస్తున్నారని, ప్రజలందరూ ఉద్యమిస్తేనే తప్ప ఆగవని హెచ్చరించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పార్టీతో సంబంధం లేదని, పార్టీలో చేరకముందు నుండి పర్యావరణంపై పనిచేస్తున్నామని తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: