Corporater sravan Fire on officer's | పని చేయని అధికారులను సస్పెండ్ చేయండి కార్పొరేటర్ శ్రవణ్
Автор: Political DNA
Загружено: 2025-08-19
Просмотров: 112
సఫిలగూడ చెరువు వద్ద వినాయక చవితి పనులు షురూ,కార్పొరేటర్ శ్రవణ్ పోరాట ఫలితం
ఈ రోజు GHMC అధికారులు సఫిలగూడ చెరువు వద్ద చెప్పట్టిన నిమర్జన ఏర్పాట్లను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు.
నిన్న నిమర్జన ఏర్పాట్లను ఇంకా మొదలుపెట్టలేదని శ్రవణ్ చెప్పట్టిన నిరసన మేరకు అఘామేఘాల పై ఈరోజు పనులు చెప్పట్టిన అధికారులకు శ్రవణ్ ఘాటైనా సూచనలు చేసారు.
నూతన బోర్లను పైప్ లైన్ ద్వారా అందుబాటులో లోకి తేవాలని, గుర్రపు డెక్క వేగంగా తీయాలనీ,
నిమర్జన ప్రదేశం లోని బేబీ పాండ్ లో నిలువ నీరు మోటార్ ద్వారా తీసివేయాలని, గోడ ఎత్తు పెంచాలని, సుందరీకరణ పనులు వేగవంతం చెయ్యాలని, టాయిలెట్స్ నిర్మాణం చెప్పటాలని కోరారు.
గుర్రపు డెక్క తీసివేతకు రాంకీ అదనపు వాహనాలను ఏర్పాటు చెయ్యాలని జోనల్ కమీషనర్ రవి కిరణ్ గారిని చరవాణి ద్వారా కోరారు.
సఫిలగూడ గేట్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ వెయ్యాలని TGSPCDL ఏ. డి. ఈ చంద్రశేఖర్ ను చరవాణి ద్వారా కోరారు.
డి.ఈ మహేష్ ను సస్పెండ్ చెయ్యాలి
ఎప్పుడు చూసినా ఎదో ఒక సాకుతో, ఫీల్డ్ వర్క్ అని చెప్తూ పనులు పూర్తి చెయ్యని డి. ఈ మహేష్ ఏ ఒక్క పనులలో నాణ్యత పరిశీలన చెయ్యడం లో విఫలమయ్యారు.
సఫిలగూడ చెరువు కి నోడల్ ఆఫీసర్ అయిన మహేష్ గుర్రపు డెక్క తీయడం లో విఫలం అయ్యారన్నారు.
వెంటనే ఆయనని సస్పెండ్ చెయ్యాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం లో ఈ. ఈ లక్సమాన్, ఏ. ఈ నవీన్, రమేష్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: