Alampur Jogulamba Temple
Автор: Journey with Balaraju
Загружено: 2025-01-18
Просмотров: 193
జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమిది. పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం, తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్ లో ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది.[1][2]
జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 2019లో, ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్‌మెంట్ డ్రైవ్) పథకం కింద చేర్చారు
#alampur-jogulambatemple
#jogulamba_gadwal
#journeywithbalaraju
#shaktipeeth
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: