మనకు ఇంకా తెలియాల్సిన అనేక అన్నమయ్య సంకీర్తనలను మనకు అందకుండా కుప్పగా పోసి ఎందుకు తగులబెట్టారు.?
Автор: Telugu Planet Official
Загружено: 2023-02-28
Просмотров: 2713
#unknownfactaboutannamachara
సాహిత్యం ఆలోచనలు రేకెత్తించేదిగా జీవిత అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి
ఈ భావనని 500 ఏళ్లకు ముందే అన్నమయ్య వ్యక్తీకరించాడు…
ప్రజల పక్షంపూని నిలిచేదే సాహిత్యం.ఆ సాహిత్యం ప్రజల ఆశయాలు అక్షరబంధం చేస్తుంది.
ప్రజాలకు చైతన్య మార్గం అందిస్తుంది. ప్రజలు అజ్ఞానాంధకార దురాచార సుంకరబద్దులుగా బతుకుతున్నప్పుడు వారికి జ్ఞానబోధ చేసి
మానసిక మార్పులను కలిగించి బ్రతుకును సుఖవంతమైన మార్గం వైపుకు మళ్ళించే ప్రయత్నమే సామాజిక చైతన్యం
పైన తీయని భక్తి పూత, లోన కఠినమైన జీవన వాస్తవ చిత్రం ప్రస్తావించడం అన్నమయ్యలో గమనించవచ్చు.
కేవలం దైవభక్తి, , మతం , శృంగారం వంటివి చెప్పి ఊరుకోకుండా, ఆనాటి సాంఘిక దురాచారాలను అన్నమయ్య తన కీర్తనల్లో పేర్కొన్నాడు.
.
అన్నమయ్య సంకీర్తనలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమే కాదు , తన సాటిమానవులను కూడా మేల్కొల్పి మంచి మార్గంలో నడిపించడానికి పదాలను వినియోగించిన పద కవితా పితామహుడు అన్నమయ్య
తన సంకీర్తనలన్నిట భక్తి ప్రవర్తుల్ని ఆధ్యాత్మికతతో ప్రధానంగా ప్రతిపాదించి సందర్భోచితంగా నీతి ఉపదేశం చేయటంలో ఆయన ఎంతో ప్రముఖమైన పాత్ర వహించినట్లుగా మనకు తెలుస్తుంది అన్నమయ్య వచనాలలో భాషలో భావంలో ప్రముఖంగా ప్రజాకవి కనుకనే ప్రజా శ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రతిపాదిక సంకీర్తనలు ఆడి పాడినట్లు మనకు తెలుస్తుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: