Erragadda Sunday Market | Chor Bazar | Hyderbad | Erragadda | Pradeep thammadi zindagi
Автор: pradeep thammadi zindagi
Загружено: 2024-03-18
Просмотров: 497035
ఎర్రగడ్డ సండే మార్కెట్ పార్ట్ వన్ వీడియో లింక్..
• Erragadda Sunday Market | Chor Bazar | Err...
#pradeepthammadizindagi #erragaddamarket #hyderabad #chorbazar #teluguvlogs
Erragadda Sunday Market | Chor Bazar | Hyderbad | Erragadda | Pradeep thammadi zindagi
అందరికీ హాయ్..
ఈ వీడియో తెలంగాణలోని హైదరాబాద్లో గల ఎర్రగడ్డ సండే( సంత )మార్కెట్ గురించి. ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. హైదరాబాద్లోని జుమ్మెరత్ బజార్ అంటే అదే చోర్ బజార్ లాగే డైలీ లైఫ్ లో ఉపయోగించి అన్ని రకాల వస్తువులు ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ లో కూడా అతి తక్కువ ధరకు దొరుకుతవి. అందుకే ఈ మార్కెట్ ను మరో చోర్ బజార్ అని కూడా అంటారు. ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ లో మహిళలు, పురుషుల దుస్తులు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ బర్డ్స్ , వంట సామాను, చిన్న నుంచి పెద్ద పనిముట్లు, సైకిల్లు, సెంట్ బాటిల్లు, జిమ్ పరికరాలు, జీడిపప్పు, మహిళల అలంకరణ సామాగ్రి, బ్యాగులు, నాటు కోళ్లు, పెట్స్ పావురాలు చిలుకలు, కుక్కపిల్లలు, వివిధ రకాల పక్షులు, బాతులు అతి తక్కువ ధరల్లో అమ్ముతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు ఫైనల్ కావు. మనం అడిగితే సగానికి సగం తగ్గించి ఇస్తారు.
టైమింగ్స్..
ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలవుతుంది. రాత్రి 10 గంటల వరకు మార్కెట్ కొనసాగుతుంది.
లోకేషన్..
ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. హైదరాబాదులోని మహాత్మా గాంధీ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు కూడా ఉంటాయి.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి.. శుభదినం.
ప్రదీప్ తమ్మడి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: