Part 023 - పురాణ పురుషుడు - గ్రంథాధ్యయనము - PURANA PURUSHUDU - GRANTHAADHYAYANAMU
Автор: Master E.K Spiritual & Service Mission
Загружено: 2026-01-20
Просмотров: 266
వేదము ఎంత నిగూఢమైనదో, కృష్ణావతారము అంతే లోతులు కలది.కారణము వేదపురుషుడే కృష్ణునిగా అవతరించాడు గనుక.ఈ సమన్వయమును దర్శించుటయే గాక గ్రంథరూపములోనికి అవతరింపజేసి పాఠకులకు ఆ అనుభూతిని పంచిపెట్టుట ఆ పరమపురుషుని పరమాద్భుత లీలావిభూతులలో నొకటి.ఇట్టి లీలకు వేదికయైన ఆ గ్రంథరాజమే "పురాణపురుషుడు".మాస్టరు ఇ.కె.గారి ద్వారా వెలువడిన శ్రీకృష్ణావతార తత్త్వ వివరణ గ్రంథములలో మూడవది, కథాక్రమమును అనుసరించి మొదటిది"పురాణపురుషుడు". చదువరుల జన్మాంతర సంస్కారమును బట్టి, పరిణామమును బట్టి ఈ గ్రంథము అవగతమగుననుట సత్యము. అనగా ఎంత ఎదిగితే అంతగా ఈ గ్రంథ లోతులు అనుభూతమవుతాయి. కృష్ణుని గూర్చి ఇలా ఎవరు చెప్పగలరు? ఆ కృష్ణుడే మరల దిగి వచ్చి తన కథ తానే చెబుతున్నాడని పాఠకులకు అనుభూతమగుట తథ్యము.ఈ గ్రంథము చదువుతున్నంత సేపు మనముండక తాదాత్మ్యసిద్ధిని అప్రయత్నంగా పొందుతాము. పురాణములలో మూలమూలల దాగివున్న ఆ యా పాత్రల నైజములను ఈ గ్రంథము మనకు కరతలామలకము చేస్తుంది. భరతజాతి చైతన్యస్వరూపిణి యగు జగన్మాతకు,కృష్ణునకు గల అభేదము ఈ గ్రంథమున కీర్తించిన విధము నిరుపమానము. భరతభూమికి మూడు దిక్కుల నుండి సముద్రములో అలలు లేచినప్పుడెల్ల దేవకి గర్భమున తెరలు తెరలుగ నొప్పులు కలిగినవట. భరతభూమి యందలి పుణ్యనదుల జలప్రవాహమంతయు దేవకీదేవి గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్తప్రసరణమట. మబ్బులు క్రమ్మి,వెన్నెల మాటుపడినపుడు దేవకి గర్భము భారముగను, మబ్బులు విచ్చి,వెన్నెల కనుపించినపుడు ఆమె గర్భము తేలికగను అనిపించెనట.ఒకమారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు,మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజలక్షణమట. ఏమి ఈ వేదకవిసమయములు!ఈ గ్రంథములో వర్ణించిన కృష్ణుని అవతరణమునకు ముందున్న భరతభూమి పరిస్థితులు, కృష్ణావతార ఆవశ్యకతకు దారితీసిన పరిస్థితులు నేటి వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టడం అనూహ్యము.ఈ గ్రంథ హృదయమంతా నాందీభూతముగా మొదటి అధ్యాయంలో బీజరూపంలో సూచించిన విధానము అత్యద్భుతము.ఆయుర్వేదము, జ్యోతిర్వేదము, అథర్వణవేదము, మంత్రశాస్త్రము, వామాచార ప్రక్రియల వివరణము ఒకవైపు; వీరభద్రులు, పోలేరమ్మలు, పోతురాజులు మున్నగువారి సంప్రదాయ చరిత్రలు మరొకవైపు ఈ గ్రంథమున హృద్యముగ వర్ణింపబడినవి. పరావాక్కుగా పరాశరుడు, పశ్యంతీవాక్కుగా సత్యవతి, మధ్యమావాక్కుగా వ్యాసుడు దర్శనమిచ్చి ఆ అనుభూతి అంతా వైఖరీవాక్కుగా ఋషుల నుండి వ్యక్తమై వేదసంహిత భాగములుగా దిగి వచ్చుట,ఈ మొత్తము వేదసంహిత కృష్ణుని అవతారలీలాఘట్టములను సూచించుట ,దేవకి అష్టమగర్భమున జన్మించిన శిశువు దేశకాలాత్మకుడైన వేదమూర్తిగా సమన్వయింపబడుట ఈ గ్రంథమున వైభవోపేతముగా సంకీర్తనము చేయబడినది. కృష్ణుడు అవతరించుటకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నవి కదా,మరి కృష్ణుడు మరల ఇప్పుడు అవతరిస్తాడా అంటే,ఈ గ్రంథరూపంలో అవతరించి ఎప్పటికప్పుడు మనలను కర్తవ్యోన్ముఖులను చేస్తున్నాడు అనేది సహృదయులైన పాఠకుల అనుభవము. తెలుగుజాతి చేసుకున్న పుణ్యమేమో గాని ఆ కృష్ణుడే కృష్ణమాచార్యుడై ఈ గ్రంథము ద్వారా తన దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూ ధర్మోత్తరజీవితమునకు దారిచూపుట మన మహద్భాగ్యము. శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న భాగవత సప్తాహములలో భాగంగా శ్రీ రామనామ క్షేత్రం, గుంటూరులో నిర్వహింపబడిన భాగవత సప్తాహములో ఈ పురాణపురుషుడు గ్రంథము యెుక్క వివరణాత్మక అధ్యయనము కొనసాగింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: