రామచరణం రామచరణం -- భక్తిగీతం •• rama charanam Rama charanam -- bhakthi geetham
Автор: పాటల విహారం
Загружено: 2024-04-15
Просмотров: 22057
"రామచరణం రామచరణం"
రచన: కృష్ణశాస్త్రి గారు
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం గారు
గానం: శ్రీరంగం గోాపాలరత్నం గారు
lyricist: Krishna sasthri garu
music: Palagummi viswanadham garu
singer: sreerangam garu
ఇందులో వింజమూరి లక్ష్మి గారు కూడా పాడారు. తాయారు గారు యిచ్చిన సమాచార ప్రకారం
bhakthi geethalu
భక్తి గీతాలు
#పాటలవిహారం
రామ చరణం రామ చరణం
రామ చరణం మాకు శరణం
మాకు చాలును
మౌని మస్తక భూషణం
శ్రీ రామ చరణం
రాగయై ఈ బ్రతుకు చెడి
రాయైన వేళల రామచరణం
మూగయై పెనుధూళి పడి
మ్రోడైన వేళల రామ చరణం
ప్రాణమీయగా రామచరణం
పటిమనీయగా రామచరణం
మాకు చాలును జరయు
మరణం రాకప్రోచే రామచరణం
కోతియై ఈ మనసు
నిలకడ కోలుపోతే రామచరణం
సేతువై భవజలధి
కారణ హేతువైతే రామచరణం
ఏడుగడ శ్రీ రామచరణం
తోడుపడ శ్రీ రామచరణం
మాకు చాలును ముక్తి సౌధ
ప్రాంగణం శ్రీ రామచరణం
నావలో తానుండి
మము నట్టేట నడిపే రామచరణం
త్రోవలో కారడవిలో తోడ్తోడ
నడిపే రామచరణం
నావయైతే రామచరణం
త్రోవయైతే రామచరణం
మాకు చాలు వికుంఠ మందిర
తోరణం శ్రీ రామచరణం
దారువునకును రాజ్య ధూర్వహ
దర్పమిచ్చే రామచరణం
భీరువునకును అరినెదీర్చే
బీరమిచ్చే రామచరణం
ప్రభుతనిచ్చే రామచరణం
అభయమిచ్చే రామచరణం
మాకు చాలు మహేంద్ర వైభవ
కారణం శ్రీ రామచరణం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: