తిరుప్పావై 28వ రోజు 12 January 2026
Автор: Rama Sabha @24
Загружено: 2026-01-11
Просмотров: 88
🌺28వ పాశురం భావం🌺
**************************
గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కాని వారి అంతరంగమందున్న కోరిక ఆముష్మిక మైనదని స్వామికి తెలియును 'నీకూ మాకునూ ఉన్న సంబంధమే! మేము అజ్ఞానులము. మేము నిన్నుగాని, నీవు మమ్ములనుగాని విడిచి వుండలేని బంధమే అర్హత' అని ఈ పాశురములో విన్నవించారు
ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే సద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వివేకము ఏమాత్రమునూ లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకు అదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాదలు ఏమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పఱై వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సఖులమే అని యెంచి మాపై కృపచేయుమని గోపికలందరూ స్వామికి శరణాగతి చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయ ఆశీర్వదించుమని, తమ తప్పులను సవరించమని క్షమాయాచన చేశారు.
శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#credits :vishnuprabhans Instagram page
lalitha_dasudu Instagram page
Gemini creation
#tiruppavy
#dhanurmasam
#sreerangam
#devotionalhits
#bakthisongs
#aandal
#padmajaramanujadasi
#srikrishna
#srisrisritridandichinajeeyarswamji
#song
#shortsvedios
#short
#shorts
#shortsfeed
#shortsvideoviral
#templetour
#templevibs
#telugutiruppavai
#trendingvideo
#trendingshorts
#festivevibes
#festival
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: