నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా గాలికి ఎగిరి పోయే పొట్టును విలువను చూపిన యేసయ్యా
Автор: Mood Nageshwarrao songs
Загружено: 2026-01-12
Просмотров: 453
పల్లవి : నీతి మంతుల సభలో నన్ను
నిలిపిన యేసయ్యా
గాలికి ఎగిరి పోయే పొట్టును
విలువను చూపిన యేసయ్యా...
నీతిమంతుల సభలో నన్ను
నిలిపిన యేసయ్యా.....
1, నులి వెచ్చని నా జీవితం..
నీ నోటి నుండి ఉమ్మ బడితిని
నీ ఉమ్ములో దుమ్ముగ నేను...
చేరే అర్హత పోగొట్టు కుంట్టిని
గాలికి ఎగిరే రెల్లును నేను యేసయ్యా..
సుడిగాలి పయనము నాది యేసయ్యా...
నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా.....
2, దేశ దిమ్మిరి నా జీవితం..
నీ నోటి నుండి శపింప బడితిని...
పాప శాపాల ఫలమే నేను..
నిన్ను మహిమ పరచక పోతిని...
నా అహము తుంచిన యేసయ్యా...
నా విశ్వాసం దృడపరచిన యేసయ్యా....
నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా.....
3, పనికి రాని పాత్రను నేను..
పెంట్ట కుప్పలో పడవేబడితిని...
జారి పోయిన మన్నును నేను..
సారే పై నన్ను ఉంచితివి
పని కొచ్చే పాత్రగ మలచిన యేసయ్యా..
నీ సాక్షినై సాగి పోదును యేసయ్యా...
నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా.....
5, రుచి లేని ఉప్పును నేను...
సుచి లేక పడ వేయ బడితిని..
దుష్టులచే తొక్క బడితిని...
మట్టి లోన కలిసి పోతిని...
బ్రతికి ఉన్న శవమును నేను యేసయ్యా..
ఈ పాపిని బ్రతికించివావు యేసయ్యా...
నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా.....
5, పురుగు పట్టిన తీగెను నేను...
నీ రక్తముతో కడగ బడితిని..
నీ భక్తులచే పిలువ బడితిని...
నీ ఆత్మతో అభిషేకంప బడితిని
ద్రాక్ష వల్లి వై అంటు కట్టిన యేసయ్యా..
జీవ నది తీరమున నాటిన యేసయ్యా...
నీతిమంతుల సభలో నన్ను నిలిపిన యేసయ్యా.....
రచన : మూడ్ నాగేశ్వరరావు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: