గురుకుల విద్యాలయం రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనకి చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ- ఆళ్లగడ్డ
Автор: Rv 99News
Загружено: 2025-12-16
Просмотров: 124
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ...
ఆళ్లగడ్డ పట్టణంలోని గురుకుల విద్యాలయం ని ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు...
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, భోజనశాలను మరియు హాస్టల్ ను పరిశీలించి, అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది, పిల్లలందరికీ నాణ్యతమైన భోజనాన్ని పెట్టాలని భోజన విషయంలో ఏదైనా నాణ్యతలేని భోజనం పెడితే ఊరుకునేది లేదని స్కూల్ యాజమాన్యానికి తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు...
పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ చిన్నగా ఉందని 600 మంది పిల్లలు తినడానికి సరిపోడం లేదని, ఈ విషయమై మంత్రి నారా లోకేష్ అన్న గారితో మాట్లాడి, డైనింగ్ హాల్ పెద్దగా కట్టిచ్చేలాగా చూసుకుంటామని. అప్పటిదాకా పిల్లలు ఎవరు ఇబ్బంది పడకుండా. ఆల్టర్నేట్ గా ఏదైనా చేసి అందరూ ఒకేసారి తినేలాగా చూసుకుంటామని, అలాగే పిల్లలకి తాగడానికి ఆర్వో ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది అని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
అనంతరం ల్యాబ్ మరియు స్కూల్ టీచింగ్ రూములను తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడి ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా కూడా నాకు వెంటనే తెలియజేయండి నేను చూసుకుంటానని తెలిపారు, యాజమాన్యానికి కూడా ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయండి వాళ్లు స్పందించకుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి నేను యాక్షన్ తీసుకుంటానని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు...
పిల్లలు కింద కూర్చొని తినడం చాలా బాధగా ఉందని పిల్లలందరూ పైన కూర్చొని తినడానికి సంబంధించి 80 టేబుల్స్ కావాలని, భూమా శోభనాగిరెడ్డి ట్రస్ట్ తరఫున మేము కూడా కొన్ని ఇస్తామని, అలాగే P4 స్కీం కింద దత్తత తీసుకునేవారు 130 మంది దాకా ఉన్నారని వారు కూడా స్పందించి ముందుకు వచ్చి పిల్లలకు టేబుల్స్ మరియు పడుకోవడానికి బెడ్స్ సహాయం చేస్తే బాగుంటుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
స్కూల్లో గేమ్స్ పై చాలా మక్కువగా ఉన్నారని, చెస్ రబ్బీ గేమ్ లో సెమీఫైనల్ వరకు వెళ్లడం జరిగిందని వారందరికీ మా నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి చేతుల మీదుగా గులాబీ మొక్కను నటించిన గురుకుల విద్యాలయ యాజమాన్యం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: