ఎమ్మెల్యే ఆదేశాలు vs ప్రభుత్వ నిబంధనలు..మునుగోడులో వైన్ షాపులపై తీవ్ర ఉద్రిక్తత | Prime9 Nalgonda
Автор: Prime9 Nalgonda
Загружено: 2026-01-23
Просмотров: 249
#prime9nalgonda #munugode #yadadribhuvanagiri #telanganapolitics #WineShopsIssue
#rajagopalreddy #congressparty #excisedepartment
#telugunews #politicaltensions #localnews
#policesecurity #currentaffairs
యాదాద్రి భువనగిరి జిల్లా
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వైన్ షాపులను ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు నేడు తిరిగి తెరిపించారు.నిన్న సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపులను బలవంతంగా మూయించారు. దీంతో లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకవైపు,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోవైపు అన్నట్టుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో వైన్ షాపులను తిరిగి ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాటు చేశారు.అయితే ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగానే, వైన్ షాపుల ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒకటి గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలని, వైన్ షాప్ యజమానులకు కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిబంధనలో ప్రతి ఒక్కరు పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు..
| Subscribe |
| Prime9 Nalgonda |
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: