సరదాగా జ్యోతిషం | నక్షత్రాలు - నవగ్రహాలు - నవరత్నాలు | Jyotisham | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2025-02-15
Просмотров: 14894
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం సరదాగా జ్యోతిషం అనే శీర్షికలో మొదటి భాగాన్ని చెప్పుకుందాం. జ్యోతిషం చాలా గొప్ప శాస్త్రం. వేదాంగాలలో ఒకటి కూడా. అయితే జ్యోతిష పండితులలో కొంతమంది వల్ల ఈ శాస్త్రంపై చాలా అపోహలు మొదలయ్యాయి. కొందరు వైద్యులు సరిగా వైద్యం చేయనంత మాత్రాన వైద్యశాస్త్రం తప్పైపోదు కదా! అలానే జ్యోతిషం కూడా. చాలా తేలికైన మాటల్లో చెప్పుకోవాలంటే జ్యోతిషం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతులను తెలుపుతుంది. ఇది పూర్తిగా ఖగోళ సంబంధమైనది. ఇక రెండవభాగం ఆ గ్రహాలు, నక్షత్రాలు మనపై చూపించే ప్రభావాన్ని చెబుతుంది. ఈ రెండు భాగాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసినవాడే గొప్ప జ్యోతిషుడవుతాడు. జ్యోతిషుడవ్వాలంటే మంచి గణితశాస్త్ర విజ్ఞానం కూడా ఉండుండాలి. లెక్కల్లో ప్రావీణ్యం లేనివాడు జ్యోతిషుడు కాలేడు.
ఇక సరదాగా జ్యోతిషం అనే ఈ శీర్షిక ద్వారా జ్యోతిష శాస్త్రంలోని కొన్ని అంశాల గురించైనా మనవారికి అవగాహన కల్పించడమే నా ఉద్దేశ్యం. ఈ మొదటిభాగంలో మన శాస్త్రంలో చెప్పబడ్డ 27 నక్షత్రాల పేర్లను, ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతో, అలానే ఏ నక్షత్రానికి, ఏ గ్రహస్థితికి ఏ రత్నం ధరించాలో మొదలైన అంశాల గురించి వేళ్ళ మీద లెక్కలు వేస్తూ చెప్పుకుందాం. కేవలం నక్షత్రాన్ని బట్టో, గ్రహస్థితిని బట్టో ఠపీమని ఫలానా రత్నం పెట్టుకోమని చెప్పకూడదు. అందుకు ఇంకొన్ని జాతక విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాకపోతే ప్రాథమికమైన విషయాలలో ఎటువంటి మార్పులు ఉండవు కనుక, వాటిని తెలుసుకోవడం సరదాగాను, విజ్ఞానదాయకంగాను ఉంటుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: