Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

నహుషుడి కథ || అధికారం తలకెక్కితే... నహుషుడి గతే || nahusha chaganti koteswara rao speeches

Автор: Sri Guru Bhakthi Pravachanalu

Загружено: 2021-04-28

Просмотров: 86603

Описание:

#chaganti,
#latest,
#chagantikoteswararao,
#nahushudu chaganti,
#nahushuduchaganti,
#nahushachaganti,
chaganti koteswara rao,
chagantikoteswararao,
chaganti latest,
chaganti latest speech,
chaganti koteswara rao speech,
chaganti koteswara rao speeches,
chaganti koteswara rao latest speech,
chaganti koteswara rao latest speeches,
chaganti koteswara rao speeches funny,
chaganti koteswara rao speeches on shiva,
chaganti koteswara rao stories,
chaganti koteswara rao stories telugu,
chaganti koteswara rao speech latest 2021,
Sri Guru Bhakthi Pravachanalu

మహబలుడైన భీముడు కొండ చిలువకు ఎలా చిక్కాడు?

అధికారం తలకెక్కితే... నహుషుడి గతే

నహుషుడి కథ

ఒకరోజు భీముడు వేట నిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచిలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి " నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా ! నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్టించాను. కాని ఒక మునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దుఃఖించాడు. ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచిలువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బందీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా ! నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టు కుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగ మాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీ వంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్త ఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను. ప్రత్యేకంగా అగస్త్యుడిని అవమానించిన కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆ శాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో.

నహుషుని ప్రశ్నలు
ధర్మరాజు " అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు " అన్నాడు. కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విషయమేమిటి? " అని అడిగాడు. జవాబుగా ధర్మరాజు " సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దుఃఖముల ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య " అన్నాడు. నహుషుని రెండవ ప్రశ్న " శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువ బడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు " మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు కలిగిన శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం " అని జవాబిచ్చాడు. నహుషుని మూడవ ప్రశ్న " పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎందుకు పొందింది? " అని అడిగాడు. ధర్మరాజు " దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించ బడుతుంది " అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని నహుషుడు భీముని వదిలాడు. తన అజగర రూపం వదిలి దివ్యమైన మానుషరూపం పొందాడు. తరువాత ధర్మరాజు భీముని తీసుకుని తమ కుటీరానికి తీసుకువెళ్ళాడు.

నహుషుడి కథ || అధికారం తలకెక్కితే... నహుషుడి గతే || nahusha chaganti koteswara rao speeches

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

గంధమాధన పర్వతం || భీముడు ఆంజనేయుని ఎలా కలుసుకుంటారు..! | జటాసురుడు | chaganti koteswara rao speeches

గంధమాధన పర్వతం || భీముడు ఆంజనేయుని ఎలా కలుసుకుంటారు..! | జటాసురుడు | chaganti koteswara rao speeches

సుకన్య మరియు చ్యవన మహర్షి పూర్తి కథ sukanya and chyavana maharshi full story chaganti koteswara rao

సుకన్య మరియు చ్యవన మహర్షి పూర్తి కథ sukanya and chyavana maharshi full story chaganti koteswara rao

అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అసలు ఆ కథ ఏమిటి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అసలు ఆ కథ ఏమిటి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

ద్రోణాచార్య జీవిత చరిత్ర Dronacharya pravachana Sri Chaganti ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథ #eshwartv

ద్రోణాచార్య జీవిత చరిత్ర Dronacharya pravachana Sri Chaganti ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథ #eshwartv

ఋష్యశృంగుడు జింకకు ఎలా పుట్టాడు? || ఋష్యశృంగ || rishyasringa || chaganti koteswara rao speeches

ఋష్యశృంగుడు జింకకు ఎలా పుట్టాడు? || ఋష్యశృంగ || rishyasringa || chaganti koteswara rao speeches

ఉద్యోగపర్వం 14 • దుర్యోధనుడు సంధి ఒప్పుకోకపోవుట • Chaganti • Mahabharatham

ఉద్యోగపర్వం 14 • దుర్యోధనుడు సంధి ఒప్పుకోకపోవుట • Chaganti • Mahabharatham

అరణ్యపర్వం 24 • అగస్త్య మహర్షి సముద్రాన్ని త్రాగుట • Agastya drinking ocean • కాలకేయుల వధ • Chaganti

అరణ్యపర్వం 24 • అగస్త్య మహర్షి సముద్రాన్ని త్రాగుట • Agastya drinking ocean • కాలకేయుల వధ • Chaganti

Chaganti Koteswara Rao speeches latest pravachanam telugu

Chaganti Koteswara Rao speeches latest pravachanam telugu

పరశురామావతారము వినడం వలన అరిష్టము , పీడ తొలిగిపోతాయి || chaganti speech about parushuramudu

పరశురామావతారము వినడం వలన అరిష్టము , పీడ తొలిగిపోతాయి || chaganti speech about parushuramudu

Chaganti Koteswara Rao Speech Latest | మీ జీవితం 100% గొప్పగా మారాలంటే? | Life Change | Eha Bhakthi

Chaganti Koteswara Rao Speech Latest | మీ జీవితం 100% గొప్పగా మారాలంటే? | Life Change | Eha Bhakthi

నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు Chaganti Koteswara Rao speeches pravachanam latest

నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు Chaganti Koteswara Rao speeches pravachanam latest

ఘటోత్కచ జీవిత చరిత్ర   జీవితంలో ప్రతి ఒక్కరూ వినవలసిన కథ  Ghatotkacha Charitra By Sri Chaganti

ఘటోత్కచ జీవిత చరిత్ర జీవితంలో ప్రతి ఒక్కరూ వినవలసిన కథ Ghatotkacha Charitra By Sri Chaganti

కచ - దేవయాని - యయాతుల వృత్తాంతం • kacha - Devayani - Yayati • Chaganti • Mahabharatham

కచ - దేవయాని - యయాతుల వృత్తాంతం • kacha - Devayani - Yayati • Chaganti • Mahabharatham

కావ్య కంఠ వాశిష్ట గణపతి ముని చరిత్ర | Kavya Kanta Vasista Ganapathi Muni Charitr | #chaganti

కావ్య కంఠ వాశిష్ట గణపతి ముని చరిత్ర | Kavya Kanta Vasista Ganapathi Muni Charitr | #chaganti

Chaganti koteswara rao latest | Chaganti pravachanam | Chaganti latest speeches #chaganti

Chaganti koteswara rao latest | Chaganti pravachanam | Chaganti latest speeches #chaganti

భగవంతుడు ఎందుకు భాద పెడుతాడో తెలుసా? Chaganti Koteswara Rao Speeches #chagantipravachanalu #chaganti

భగవంతుడు ఎందుకు భాద పెడుతాడో తెలుసా? Chaganti Koteswara Rao Speeches #chagantipravachanalu #chaganti

జన్మ సార్థకం కావాలంటే తెలుసుకోవలసిన కఠిన వాస్తవాలు | ఆత్మ సాక్షాత్కార స్తోత్రం-2 | Garikapati Speech

జన్మ సార్థకం కావాలంటే తెలుసుకోవలసిన కఠిన వాస్తవాలు | ఆత్మ సాక్షాత్కార స్తోత్రం-2 | Garikapati Speech

దేవయాని యయాతి కథ | అల్లుడిని ముసలివాడు అవమని శుక్రాచార్యుడు ఎందుకు శపించాడు? || Chaganti Speeches

దేవయాని యయాతి కథ | అల్లుడిని ముసలివాడు అవమని శుక్రాచార్యుడు ఎందుకు శపించాడు? || Chaganti Speeches

ఆంజనేయ స్వామి కృప ఉంటేనే ఇది వింటారు please like share and subscribe to my channel

ఆంజనేయ స్వామి కృప ఉంటేనే ఇది వింటారు please like share and subscribe to my channel

ఉద్యోగపర్వం 20 • భీష్ముడు కౌరవ-పాండవ పక్షాల బలాలను చెప్పుట • Chaganti • Mahabharatham

ఉద్యోగపర్వం 20 • భీష్ముడు కౌరవ-పాండవ పక్షాల బలాలను చెప్పుట • Chaganti • Mahabharatham

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]