నాట్యము హరిహరాత్మకము - B.Ramesh Sarma, Prashanti Chopra, GP Raviin, Sravani Tenneti World Dance Day
Автор: Prashanti Chopra
Загружено: 2025-04-28
Просмотров: 464
#prashantichopra #telugu #worlddanceday
Natyamu Hariharatmakamu
నాట్యము..హరిహరాత్మకము!
రచన: భారతుల రమేష్ శర్మ
స్వరకల్పన, గానం: ప్రశాంతి చోప్రా
నేపధ్య సంగీతం: జిపి రవీన్
"నృత్యం" మీద పాట!
* * * *
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
సకల కళాసారము! సుగుణ సాంద్రము!
అది రమణీయ కమనీయ దృశ్యకావ్యము!—-
నాట్యము..హరిహరాత్మకము!
జటాఝూటమున ముదమెంతొ ఉప్పొంగ
పరవశించుచు పరవళ్లు తొక్కంగ
శివగంగ చేసేది నాట్యం! అది గంగరంగ వైభోగం!
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
నాట్యము..హరిహరాత్మకము!
ఉమాసహితుడై మహాదేవుడు సరసాల శృతిమీటి
ముదమార చేసేది నాట్యం! అది తాండవకేళీ కలాపం!
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
నాట్యము..హరిహరాత్మకము!
రమాధవుడు ఆ మాధవుడు చిద్విలాసముగ చిరునగవు చిందించి
క్షణక్షణము చేసేది నాట్యం! అది లీలామానుష వేషం!
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
దేవకీనందనుడు వ్రేపల్లె సుందరుడు గోజనము గాచుటకు కాళీయు శిరముపై….
శివమెత్తి ఆడింది నాట్యం!అది అసురసంహార విహారం!
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
పరమపూజ్యులు వేదవేద్యులు మనసార ప్రియమార
సలిపిన నవరస నాట్యం! అది దైవానికి నైవేద్యం!
నాట్యము..హరిహరాత్మకము! అతిమనోహరము! భవపాపహరము!
నటరాజ పదకమల మంజీర నర్తనం! శ్రీహరి కరచరణ రాజీవ లోచనం!
యుగయుగాలకూ అమరం! ముజ్జగాలకూ మధురం!
లయతాళ భరితము ! రసరాగ చరితము!
* * * *
రచన:
భారతుల రమేష్ శర్మ
గుంటూరు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: