Nknews ✍️ రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యాపారం జోరు. ప్రతి నాలుగు మద్యం బాటిల్స్ లో ఒకటి కల్తీ- కాకాణి
Автор: Dr Nagabushanam Koppolu
Загружено: 2025-10-09
Просмотров: 223
నెల్లూరు/ముత్తుకూరు: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు లోని మండల వైఎస్ఆర్ సిపి కార్యాలయం లో గురువారం ఉదయం మండల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైసిపి అధ్యక్షులు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటం దారుణం అన్నారు.
మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధం అవుతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేద విద్యార్థుల కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. వాటిని ప్రయివేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దీనిపై గ్రామస్థాయి నుంచి పోరాటం ప్రారంభించామని, ప్రజాభిప్రాయం ద్వారా కోటి సంతకాల సేకరణతో మెడికల్ కాలేజీలవిషయం గవర్నర్ కి తెలియజేస్తామని చెప్పారు.
కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్:
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గ్రామాలలో సమస్యలు తప్ప, అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు.
చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, హామీలు సక్రమంగా అమలు చేయకుండా మాటలతో కాలయాపన చేస్తున్నాడు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ఊరూరా ప్రచారం చేసిన కూటమి కార్యకర్తలు నేడు ప్రజలకు ముఖం చూపించకుండా చాటేస్తున్న పరిస్థితి.
చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని మొదటి సంవత్సరం ఎగ్గొట్టి, రెండవ సంవత్సరం ఇప్పటివరకు 5 వేల రూపాయలతో సరిపెట్టాడు.ఎటువంటి కోతలు లేకుండా చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15వేలు తల్లికి వందనం పధకం కింద అందిస్తానని హామీచ్చి, 40 లక్షల మంది చదువుకుంటున్న పిల్లలకు ఎగ్గొట్టి, మిగిలినవారికి అరకొరగా నిధులు జమ చేశాడు.
బస్సు సర్వీసులను పెంచకుండా, ఉచిత బస్సు పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఊసే లేకుండా నిరుద్యోగులను నట్టేట ముంచాడు.
స్త్రీ శక్తి పథకం పేరిట 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సంవత్సరానికి 18వేలు అంటూ ప్రచారం ఊదరగొట్టిన కూటమినేతలు, నేడు దానిని ప్రస్తావించడం లేదు.
చంద్రబాబుకు అబద్ధాలు మాట్లాడడం వెన్నతో పెట్టిన విద్య.
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేశామంటూ, కూటమి పార్టీ శాసనసభ్యులు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం.
చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడమే పనిగా పెట్టుకున్నాడు.
చంద్రబాబు పాలనలో ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తెచ్చిన 17 మెడికల్ కాలేజీలలో 10 మెడికల్ కాలేజీలను కూడా అమ్మేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు.
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయాలని భావించారు.
కోట్ల రూపాయలు విలువజేసే మెడికల్ కాలేజీల భూములను ఎకరా వంద రూపాయల చొప్పున ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
అక్టోబర్ 10వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు 42 రోజులపాటు అన్ని గ్రామాలలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతాం.
ప్రజలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 28వ తేదీ నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 12వ తేదీ జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నాం.
చంద్రబాబుపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది-ప్రజల నుండి సేకరించిన అభిప్రాయ సంతకాలను జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి అందజేస్తాం.
చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనుకకు తీసుకునే విధంగా ఒత్తిడి తెస్తాం.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మరలా అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శివ కుటుంబ సభ్యులకు నగదు సహాయం అందజేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందన్నారు. ప్రతి నాలుగు మద్యం బాటిల్స్ లో ఒకటి కల్తీ బాటిల్ ఉందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై పలు ఆరోపణలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మెట్టా విష్ణువర్దన్ రెడ్డి , దువ్వూరు విశ్వ మోహన్ రెడ్డి , నెల్లూరు శివ ప్రసాద్, ఎంపిపి జి.సుగుణ, జడ్పిటిసి వెంకట సుబ్బయ్య , పలువురు ఎంపిటిసి లు, సర్పంచ్ లు, మండల పరిధిలో ప్రతి గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: