దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి వినూతనమైన కార్యక్రమం...
Автор: CHINTHAMANENIPRABAKAR OFFICIAL
Загружено: 2025-12-31
Просмотров: 574
దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని మరో వినూత్న సంక్షేమ కార్యక్రమం - ఏడాది కాలంలో మరణించిన 4000 మంది కుటుంబాల కోసం కుటుంబ సభ్యుడిగా చింతమనేని మరో ముందడుగు..
"నా నియోజకవర్గమే నా కుటుంబం - వారి ప్రతి కష్టంలో అండగా ఉంటాను": దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ వెల్లడి
"మీకు అండగా మేమంతా" అంటూ దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 4000 మంది మృతుల కుటుంబాలకు పండగ వేళ అండగా నిలుస్తూ కదిలిన వందలాది మంది దెందులూరు కూటమి నాయకులు, స్థానిక పంచాయతీ కార్యదర్శులు
గడిచిన ఏడాది కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయి పండగకు దూరంగా ఉన్న దెందులూరు నియోజకవర్గం లోని 4,000 మంది కుటుంబాలను తన కుటుంబం గా భావించి, వారికి పండగ సమయంలో తానే ఒక పెద్ద కొడుకుగా ముందడుగు వేసి ఏడాదిలో వచ్చే పెద్ద పండగల సందర్భంగా అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, రాజకీయ పార్టీల భేదం లేకుండా వారి అందరి కోసం తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తానే ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేయించి, ప్రతి కుటుంబానికి కేజీ అరిసెలు + అరకిలో చెక్కలను వారి ఇంటి వద్దకే అందించేలా స్థానిక కూటమి నాయకులను సమాయత్తం చేసి తన నియోజకవర్గ ప్రజల కోసం ముందడుగెస్తూ మరో వినూత్న సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ - అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో నిత్యం గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అండగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పనితీరు పట్ల సర్వత్రా హర్షం..
దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం కూటమి నాయకులతో కలిసి సంక్షేమ కార్యక్రమా వివరాలను వెల్లడించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ - ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సాకారం చేయడంలో తనకు అన్ని విధాల సహకరించిన కూటమి నాయకులకు, మృతుల కుటుంబాల వివరాలను సేకరించడంలో సహకరించిన స్థానిక పంచాయతీ కార్యదర్శులకు, ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి , అదేవిధంగా ఈ పిండివంటల కిట్లను స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్లి అందించనున్న స్థానిక కూటమి నాయకులను అభినందించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..
#ChintamaneniPrabhakar
#newyear2026
#AndhraPradesh
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: